'పాకిస్తాన్‌లో కోహ్లి సెంచరీ సాధించాలి.. అదే మా కోరిక' | Want your Virat Kohli 71st century in Pakistan,says fans | Sakshi
Sakshi News home page

'పాకిస్తాన్‌లో కోహ్లి సెంచరీ సాధించాలి.. అదే మా కోరిక'

Mar 7 2022 1:41 PM | Updated on Mar 7 2022 3:19 PM

Want your Virat Kohli  71st century in Pakistan,says fans - Sakshi

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో సెంచరీ సాధించి రెండేళ్లు దాటింది. 2019లో చివర సారిగా బంగ్లాదేశ్‌పై కోహ్లి సెంచరీ సాధించాడు.  అయితే కోహ్లి 71వ సెంచరీ కోసం భారత అభిమానులతో పాటు యావత్తు క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇదిలా ఉండగా, పాకిస్తాన్‌ గడ్డపై కోహ్లి తన 71వ సెంచరీ సాధించాలని ఓ అభిమాని తన కోరికను వ్యక్తం చేశాడు. రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజు మ్యాచ్‌లో ఓ పోస్టర్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  కోహ్లి తన  71వ సెంచరీ పాకిస్తాన్‌లో సాధించాలని అని ఉన్న  పోస్టర్‌ను  పట్టుకుని ఓ అభిమాని కెమెరాకు కనిపించాడు. ఇక దీనికి సంబంధించిన ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక  2008లో చివరిసారిగా పాకిస్తాన్‌లో భారత జట్టు పర్యటించింది. అప్పటికీ కోహ్లి భారత జట్టులో బాగమై లేడు. ఇక భారత్‌-పాకిస్తాన్‌ల మధ్య నెలకొన్నరాజకీయ ఉద్రిక్తతల మధ్య  దశాబ్దం నుంచి ఇరు జట్లు మధ్య  ద్వైపాక్షిక సిరీస్‌లు జరగడం లేదు. దీంతో ప్రపంచ కప్‌లు, ఛాంపియన్స్ ట్రోఫీ ,ఆసియా కప్ వంటి ఇంటర్నేషనల్‌ ఈవెంట్‌లలో మాత్రమే ఇరు జట్లు తలపడతున్నాయి. ఇక శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో కోహ్లి తన కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. అయితే ఈ మ్యాచ్‌లో కేవలం 45 పరుగులు మాత్రమే చేసి కోహ్లి మరో సారి అభిమానలను నిరాశపరిచాడు.

చదవండి: IND vs SL: 'కోహ్లి సెంచరీ సాధించే వరకు నేను పెళ్లి చేసుకోను'

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement