Virat Kohli sings praise of Yashasvi Jaiswal's record-breaking innings - Sakshi
Sakshi News home page

#Yashasvi Jaiswal: వాట్‌ ఏ టాలెంట్‌.. నేను చూసిన బెస్ట్‌ బ్యాటింగ్‌ ఇదే: విరాట్‌ కోహ్లి

May 12 2023 8:56 AM | Updated on May 12 2023 9:14 AM

Virat Kohli sings praise of Yashasvi Jaiswals record breaking innings - Sakshi

ఐపీఎల్‌-2023లో భాగంగా కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ యువ ఓపెనర్‌ యశస్వీ జైశ్వాల్‌ విధ్వంసం సృష్టించాడు. కేవలం 13 బంతుల్లోనే జైశ్వాల్‌ తన హాఫ్‌ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. తద్వారా ఐపీఎల్‌ చరిత్రలోనే ఫాస్టెస్ట్‌ ఫీప్టి చేసిన ఆటగాడిగా జైశ్వాల్‌ రికార్డులకెక్కాడు. ఈ మ్యాచ్‌లో ఓవరాల్‌గా 47 బంతులు ఎదుర్కొన్న జైశ్వాల్‌ 13 ఫోర్లు, 5 సిక్సర్లతో 98 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు.

ఇక సంచలన ఇన్నింగ్స్‌ ఆడిన జైశ్వాల్‌పై టీమిండియా స్టార్‌ ఆటగాడు విరాట్‌ కోహ్లి ప్రశంసల వర్షం కురిపించాడుఏ. "వావ్‌.. ఇటీవల నేను చూసిన అత్యుత్తమ బ్యాటింగ్‌ ఇదే. వాట్‌ ఏ టాలెంట్‌ యశస్వి" అంటూ  ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో కోహ్లి రాసుకొచ్చాడు.

మరోవైపు ఆస్ట్రేలియా దిగ్గజం బ్రెట్‌ లీ కూడా జైశ్వాల్‌ను ప్రశించాడు. జైశ్వాల్‌ ఒక అద్భుతం.. అతడిని బీసీసీఐ జాతీయ జట్టులోకి తీసుకోవాలని బ్రెట్‌ లీ అభిప్రాయపడ్డాడు. ఇక ఈ మ్యాచ్‌లో కేకేఆర్‌పై రాజస్తాన్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 150 పరుగుల లక్ష్యాన్ని కేవలం 13.1 ఓవర్లలోనే రాజస్తాన్‌ ఛేదించింది.
చదవండి: # Nitish Rana: నువ్వేమన్నా నెం.1 బౌలర్‌ అనుకున్నావా.. మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేశాడు! చెత్త కెప్టెన్సీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement