Virat Kohli: ఎన్నాళ్లకెన్నాళ్లకు! సుదీర్ఘ నిరీక్షణకు తెర.. కోహ్లి ముఖంపై చిరునవ్వు! ఫ్యాన్స్‌ ఖుషీ

Virat Kohli Scores 1st Test Fifty After 15 Innings Ends 14 Months Wait - Sakshi

India vs Australia, 4th Test- Virat Kohli: ఆస్ట్రేలియాతో అహ్మదాబాద్‌ టెస్టులో టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి అర్ధ శతకంతో మెరిశాడు. 14 నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ.. టెస్టుల్లో 29వ హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇండియా ఇన్నింగ్స్‌ 92.4వ ఓవర్లో నాథన్‌ లియోన్‌ బౌలింగ్‌లో 2 పరుగులు తీసి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు.

15 ఇన్నింగ్స్‌ 50 లేకుండానే
కాగా 2022 జనవరిలో సౌతాఫ్రికా పర్యటనలో భాగంగా కేప్‌టౌన్‌ ఆఖరి సారిగా కోహ్లి టెస్టుల్లో 50 పరుగుల మార్కు అందుకున్నాడు. నాటి మ్యాచ్‌లో 201 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 79 పరుగులు చేసి.. కగిసో రబడ బౌలింగ్‌లో అవుటయ్యాడు. ఆ తర్వాత సంప్రదాయ క్రికెట్లో కోహ్లి నమోదు చేసిన స్కోర్లు వరుసగా..  29, 45, 23, 13, 11, 20, 1, 19 నాటౌట్‌, 24, 1, 12, 44, 20, 22, 13.

ఎన్నాళ్లకెన్నాళ్లకు..
ఈ క్రమంలో వరుసగా 15 ఇన్నింగ్స్‌ పాటు కోహ్లి ఒక్క ఫిఫ్టీ కూడా సాధించలేకపోయాడు. తాజాగా బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ-2023 నాలుగో టెస్టు సందర్భంగా టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. దీంతో కింగ్‌ అభిమానులు ఖుషీ అవుతున్నారు. ‘‘ఎన్నాళ్లకెన్నాళ్లకు.. నీకిష్టమైన టెస్టుల్లో హాఫ్‌ సెంచరీ.. చాలా రోజులైంది నీ ముఖంపై ఇలాంటి చిరునవ్వు చూసి! దటీజ్‌ కింగ్‌ కోహ్లి’’ అని సోషల్‌ మీడియా వేదికగా కామెంట్ల రూపంలో హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

191 పరుగుల ఆధిక్యంలో ఆసీస్‌
యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ శతకం(128)కి తోడు ఛతేశ్వర్‌ పుజారా 42, కోహ్లి 59(నాటౌట్‌) పరుగులతో రాణించడంతో టీమిండియా మెరుగైన స్కోరు చేయగలిగింది. దీంతో శనివారం నాటి మూడో రోజు ఆట ముగిసే సరికి భారత్‌ 3 వికెట్ల నస్టానికి 289-3 పరుగులు చేసింది. 191 పరుగులు వెనుబడి ఉంది. కోహ్లి 59, రవీంద్ర జడేజా 16 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

చదవండి: Virat Kohli: కోహ్లి ఖాతాలో మరో అరుదైన రికార్డు! ప్రస్తుతానికి పోటీ ఆ ఒక్కడే!
Ind Vs Aus: కోహ్లికి సాధ్యం కాలేదు.. పుజారా సాధించాడు! ‘తొలి బ్యాటర్‌’గా..

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top