కెనడా, ఖతార్‌ మ్యాచ్‌.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు! | Ugly Scenes-Qatar-Canada Players Clash-FIFA World Cup 2026 | Sakshi
Sakshi News home page

FIFA WC 2026: కెనడా, ఖతార్‌ మ్యాచ్‌.. ఆ ఒక్కడి కోసం తన్నుకున్న ఆటగాళ్లు!

Jun 19 2026 10:33 AM | Updated on Jun 19 2026 10:54 AM

Ugly Scenes-Qatar-Canada Players Clash-FIFA World Cup 2026

ఫిఫా ప్రపంచకప్‌లో కెన‌డా, ఖ‌తార్ మ్యాచ్ ముగిసిన త‌ర్వాత ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు త‌న్నుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కెన‌డా 6-0తో ఖ‌తార్‌పై ఘన విజ‌యాన్ని అందుకుంది. అయితే మ్యాచ్‌లో కెన‌డా విజ‌యం సాధించిన‌ప్ప‌టికీ ఖ‌తార్ ఆట‌గాళ్ల వైఖ‌రిని త‌ప్పుబ‌ట్టారు. అందుకే ఒక్క‌సారి మ్యాచ్‌లో ఫైన‌ల్ విజిల్ రాగానే కెన‌డా ఆట‌గాళ్లు ఖతార్ జ‌ట్టువైపు దూసుకొచ్చారు. 

ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు ఒక‌రిపై ఒక‌రు దాడి చేసుకునేందుకు య‌త్నించారు. ఈ క్ర‌మంలో మైదానంలోకి వ‌చ్చిన సెక్యూరిటీ ఇరుజ‌ట్లను వేరు చేసి అక్క‌డినుంచి పంపించేశారు. ఈ స‌మ‌యంలో మైదానంలో గంద‌ర‌గోళం నెల‌కొంది. ఈ చ‌ర్య‌ను ఇరుజ‌ట్ల కోచ్‌లు త‌ప్పుబ‌ట్టారు. దీనికి సంబంధించిన వీడియో వైర‌ల్‌గా మారింది. 

మ‌రి కెన‌డా ఆట‌గాళ్ల కోపానికి కార‌ణం ఏంటా అని ఆరా తీస్తే.. ఖ‌తార్ ఆట‌గాళ్ల త‌ప్పిదాల వ‌ల్ల కెన‌డా మిడ్‌ఫీల్డ‌ర్ ఇస్మాయిల్ కోనె కాలు విరిగింది. న‌డ‌వడానికి కూడా ఇబ్బంది ప‌డ‌డంతో అత‌డిని స్ట్రెచర్‌పై తీసుకెళ్లాల్సి వ‌చ్చింది. అయితే ఇస్మాయిల్ కోనె కాలు విర‌గ‌డానికి ప్ర‌ధాన కార‌ణం ఖ‌తార్ ఆట‌గాడు అస్సిమ్ మ‌దిబో. బంతిని పాస్ అందించ‌డానికి ఇస్మాయిల్ ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో అత‌డికి అడ్డువ‌చ్చిన అస్సిమ్ కావాల‌నే త‌ను కాలును వెనుక నుంచి అడ్డుపెట్టాడు. 

దీంతో కోనె కాలు బోన్ విరిగిపోయింది. ఈ దుశ్చ‌ర్య‌తో రిఫ‌రీ ఖ‌తార్ ఆట‌గాడికి రెడ్‌కార్డ్ జారీ చేశాడు. మ్యాచ్ విష‌యానికొస్తే ఆతిథ్య కెన‌డా.. ఖ‌తార్‌పై పూర్తి ఆధిప‌త్యం క‌న‌బ‌రిచింది. జొనాథన్ డేవిడ్ హ్యాట్రిక్ గోల్స్‌తో కెన‌డా విజ‌యంలో కీల‌క‌పాత్ర పోషించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement