Team India Lands Tauranga, Gets Traditional Maori Powhiri Welcome - Sakshi
Sakshi News home page

IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాకు అదిరిపోయే స్వాగతం! వీడియో వైరల్‌

Nov 19 2022 5:15 PM | Updated on Nov 19 2022 7:37 PM

Team India lands Tauranga,gets traditional Maori Powhiri welcome  - Sakshi

వెల్లింగ్టన్‌ వేదికగా జరగాల్సిన భారత్‌-న్యూజిలాండ్‌ తొలి టీ20 వర్షం‍ కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇక సిరీస్‌లో భాగంగా  ఆదివారం న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో తలపడేందుకు టీమిండియా సిద్దమవుతోంది. ఈ క్రమంలో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని భారత జట్టు శనివారం​ మౌంట్‌ మంగనూయ్‌లో అడుగుపెట్టింది.

ఇక మౌంట్‌ మంగనూయ్‌ చేరుకున్న టీమిండియాకు అక్కడి సాంప్రదాయ 'మావోరీ పౌహిరి' స్వాగతం లభించింది. మావోరీ స్వాగత వేడుకలో డ్యాన్స్‌, గానం, హాంగీ భాగంగా ఉంటాయి. ఇది సాధారణంగా అతిధులను ఆహ్వానించే సమయంలో ఊపయోగిస్తారు.

ఇందుకు సంబంధించిన వీడియోను టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సోషల్‌మీడియాలో షేర్‌ చేశాడు. దీంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక​ రెండో టీ20కు కూడా వర్షం ముప్పు పొంచి ఉంది. గత రెండు రోజులగా  మౌంట్‌ మంగనూయ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.


చదవండిFIFA WC 2022: ఫిఫా చరిత్రలో మాయని మచ్చలా ఐదు వివాదాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement