T20 World Cup 2021: చరిత్ర సృష్టించిన రషీద్‌ ఖాన్‌.. పొట్టి క్రికెట్‌లో అరుదైన రికార్డు

T20 World Cup 2021: Rashid Khan Becomes Youngest Bowler To Take 400 T20 Wickets - Sakshi

Rashid Khan Creates History In T20 Cricket: టీ20ల్లో అఫ్గాన్‌ స్టార్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ చరిత్ర సృష్టించాడు. పొట్టి ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 400 వికెట్లు తీసిన అత్యంత పిన్న వయస్కుడిగా(23 ఏళ్లు) రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డుతో పాటు అత్యంత వేగంగా 400 వికెట్ల మైలురాయిని చేరుకున్న ఘనతను కూడా తన పేరిట లిఖించుకున్నాడు. రషీద్‌ ఆరేళ్ల వ్యవధిలో 289 మ్యాచ్‌ల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు.

టీ20 ప్రపంచకప్‌-2021లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో మార్టిన్‌ గప్తిల్‌ను ఔట్‌ చేయడం ద్వారా రషీద్‌ అరుదైన 400 టీ20 వికెట్ల క్లబ్‌లో చేరాడు. రషీద్‌కు ముందు డ్వేన్‌ బ్రావో(553), సునీల్‌ నరైన్‌(425), ఇమ్రాన్‌ తాహిర్‌(420) మాత్రమే పొట్టి క్రికెట్‌లో 400 వికెట్ల మార్కును చేరుకున్నారు. ఇక్కడ మరో విశేషమేమింటంటే రషీద్‌ టీ20 అరంగేట్రం చేసిన తర్వాత ఏ ఒక్క బౌలర్‌గా కూడా ఈ అరుదైన మార్కును చేరుకోలేదు. 

ఇదిలా ఉంటే, న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌ 8 వికెట్ల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది. ఫలితంగా టీమిండియాతో కలిసి సెమీస్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్‌లో గెలుపుతో గ్రూప్‌-2 నుంచి రెండో జట్టుగా న్యూజిలాండ్‌ సెమీస్‌ బెర్తు ఖరారు చేసుకోగా.. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలతో పాకిస్థాన్‌ ఇదివరకే సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు గ్రూప్‌-1 నుంచి ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా జట్లు సెమీస్‌కు చేరుకున్నాయి. 
చదవండి: టీ20 ప్రపంచకప్‌-2021 నుంచి భారత్‌, అఫ్గానిస్థాన్‌ ఔట్‌.. సెమీస్‌కు న్యూజిలాండ్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top