శ్రీకాంత్‌ శుభారంభం

Swiss Open 2022: Kidambi Srikanth makes winning start - Sakshi

బాసెల్‌: స్విస్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత అగ్రశ్రేణి క్రీడాకారులు కిడాంబి శ్రీకాంత్, ప్రణయ్, పారుపల్లి కశ్యప్‌ ప్రిక్వార్టర్‌ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన తొలి రౌండ్‌ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్‌ 21–16, 21–17తో క్రిస్టోఫర్సన్‌ (డెన్మార్క్‌)పై, ప్రణయ్‌ 25–23, 21–16తో సాయిప్రణీత్‌ (భారత్‌)పై, కశ్యప్‌ 21–17, 21–9తో ఎనోగట్‌ రాయ్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచారు. పురుషుల డబుల్స్‌ తొలి రౌండ్‌లో సాత్విక్‌ సాయిరాజ్‌–చిరాగ్‌ శెట్టి (భారత్‌) జోడీ 17–21, 21–11, 21–18తో షోహిబుల్‌–మౌలానా (ఇండోనేసియా) జంటను ఓడించింది. మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో సైనా నెహ్వాల్‌ (భారత్‌) 21–8, 21–13తో యెలీ హోయాక్స్‌ (ఫ్రాన్స్‌)పై గెలిచి ప్రిక్వార్టర్‌ ఫైనల్‌ చేరింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top