ఎన్నో ఆశలు పెట్టుకున్నాము.. ఇలా చేస్తావ‌ని అనుకోలేదు!డ‌కౌట్‌గా | Sakshi
Sakshi News home page

#Suryakumar: ఎన్నో ఆశలు పెట్టుకున్నాము.. ఇలా చేస్తావ‌ని అనుకోలేదు! డ‌కౌట్‌గా

Published Sun, Apr 7 2024 5:15 PM

Suryakumar Yadav dismissed for two-ball duck in competitive cricket return - Sakshi

ముంబై ఇండియ‌న్స్ స్టార్ బ్యాట‌ర్ సూర్య‌కుమార్ యాద‌వ్ త‌న రీఎంట్రీ మ్యాచ్‌లో తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. గ‌త రెండు నెల‌ల‌గా ఆట‌కు దూరంగా ఉన్న సూర్య‌కుమార్‌.. ఐపీఎల్‌-2024లో భాగంగా వాంఖడే వేదిక‌గా ఢిల్లీ క్యాపిట‌ల్స్‌తో  మ్యాచ్‌తో పున‌రాగమ‌నం చేశాడు. ఈ మ్యాచ్‌లో సూర్య దారుణ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు.

రీ ఎంట్రీలో స‌త్తాచాటాతుడాని భావించిన ముంబై అభిమానుల ఆశ‌ల‌ను మిస్ట‌ర్ 360 ఆడియాశలు చేశాడు. ఫ‌స్ట్ డౌన్‌లో బ్యాటింగ్‌కు వ‌చ్చిన సూర్య‌కుమార్ సిల్వ‌ర్ డ‌క్‌గా వెనుదిరిగాడు. రెండు బంతులు ఎదుర్కొన్న ఈ ముంబైక‌ర్ అన్రిచ్ నోర్జే బౌలింగ్‌లో చెత్త షాట్ ఆడి ఖాతా తెర‌వ‌కుండానే పెవిలియ‌న్‌కు చేరాడు.

మిడాన్‌లో సబ్‌స్టిట్యూట్ ఫీల్డర్ జేక్ ఫ్రేజర్-మెక్‌గర్క్‌కు క్యాచ్ ఇచ్చి సూర్య ఔట‌య్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఏంటి సూర్య భ‌య్యా ఇలా చేశావు.. ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నాము అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement