RCB Vs SRH: ‘సన్‌’తోషించాల్సిన విజయం!

Sunrisers Hyderabad beat Royal Challengers Bangalore by 4 runs - Sakshi

బెంగళూరుపై రైజర్స్‌ గెలుపు

నాలుగు పరుగులతో ఓడిన ఆర్‌సీబీ

అబుదాబి: టోర్నీలో ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయిన తర్వాత సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అభిమానుల కోసం ఒక చెప్పుకోదగ్గ విజయాన్ని అందుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ 4 పరుగుల తేడాతో రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరును ఓడించింది. తక్కువ స్కోరు చేసి కూడా... ఫామ్‌లో ఉన్న ఆర్‌సీబీని హైదరాబాద్‌ నిలువరించడం విశేషం. ముందుగా హైదరాబాద్‌ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. జేసన్‌ రాయ్‌ (38 బంతుల్లో 44; 5 ఫోర్లు), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ విలియమ్సన్‌ (29 బంతుల్లో 31; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు.

అనంతరం బెంగళూరు 20 ఓవర్లలో 6 వికెట్లకు 137 పరుగులు సాధించింది. దేవదత్‌ పడిక్కల్‌ (52 బంతుల్లో 41; 4 ఫోర్లు), గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ (25 బంతుల్లో 40; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. చివరి 2 ఓవర్లలో బెంగళూరు గెలుపు కోసం 18 పరుగులు చేయాల్సి ఉండగా, 19వ ఓవర్లో హోల్డర్‌ 5 పరుగులే ఇచ్చి కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్‌ వేసిన భువనేశ్వర్‌... డివిలియర్స్‌ క్రీజ్‌లో ఉన్నా సరే, ఒత్తిడిని అధిగమించి 8 పరుగులే ఇవ్వడంతో గెలుపు హైదరాబాద్‌ సొంతమైంది. ఆఖరి బంతికి సిక్స్‌ కొట్టాల్సి ఉండగా ఒక పరుగే వచి్చంది.  
 
స్కోరు వివరాలు  
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: జేసన్‌ రాయ్‌ (సి అండ్‌ బి) క్రిస్టియాన్‌ 44; అభిõÙక్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) గార్టన్‌ 13; విలియమ్సన్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 31; ప్రియమ్‌ గార్గ్‌ (సి) డివిలియర్స్‌ (బి) క్రిస్టియాన్‌ 15; అబ్దుల్‌ సమద్‌ (ఎల్బీ) (బి) చహల్‌ 1; వృద్ధిమాన్‌ సాహా (సి) డివిలియర్స్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 10; హోల్డర్‌ (సి) క్రిస్టియాన్‌ (బి) హర్షల్‌ పటేల్‌ 16; రషీద్‌ ఖాన్‌ (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 141.
వికెట్ల పతనం: 1–14, 2–84, 3–105, 4–107, 5–107, 6–124, 7–141.
బౌలింగ్‌: మొహమ్మద్‌ సిరాజ్‌ 3–0–17–0, గార్టన్‌ 2–0–29–1, షహబాజ్‌ 4–0–21–0, హర్షల్‌ పటేల్‌ 4–0–33–3, యజువేంద్ర చహల్‌ 4–0–27–1, క్రిస్టియాన్‌ 3–0–14–2.  

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: కోహ్లి (ఎల్బీ) (బి) భువనేశ్వర్‌ 5; పడిక్కల్‌ (సి) సమద్‌ (బి) రషీద్‌ 41; క్రిస్టియాన్‌ (సి) విలియమ్సన్‌ (బి) కౌల్‌ 1; భరత్‌ (సి) సాహా (బి) ఉమ్రాన్‌ 12; మ్యాక్స్‌వెల్‌ (రనౌట్‌) 40; డివిలియర్స్‌ (నాటౌట్‌) 19; షహబాజ్‌ (సి) విలియమ్సన్‌ (బి) హోల్డర్‌ 14; గార్టన్‌ (నాటౌట్‌) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 6 వికెట్లకు) 137. వికెట్ల పతనం: 1–6, 2–18, 3–38, 4–92, 5–109, 6–128.
బౌలింగ్‌: భువనేశ్వర్‌ 4–0–25–1, హోల్డర్‌ 4–0–27–1, సిద్ధార్థ్‌ కౌల్‌ 4–1–24–1, ఉమ్రాన్‌  మాలిక్‌ 4–0–21–1, రషీద్‌ ఖాన్‌ 4–0–39–1.
 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top