స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో 2,132 వినూత్న ఆవిష్కరణలు | Sports Hackathon Event Success Meet In Hyderabad Gachibowli Stadium | Sakshi
Sakshi News home page

స్పోర్ట్స్ హ్యాకథాన్‌లో 2,132 వినూత్న ఆవిష్కరణలు

Mar 31 2026 11:40 AM | Updated on Mar 31 2026 11:53 AM

Sports Hackathon Event Success Meet In Hyderabad Gachibowli Stadium

సాక్షి, హైదరాబాద్: క్రీడలు, సాంకేతికత, ఆవిష్కరణలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన స్పోర్ట్స్ హ్యాకథాన్ ఘనంగా ముగిసింది. గచ్చిబౌలి స్టేడియంలో 24 గంటల నిరంతర కార్యక్రమంగా నిర్వహించిన ఈ వినూత్న హ్యాకథాన్‌లో రాష్ట్రం నలుమూలల నుంచి విద్యార్థులు, క్రీడాకారులు, స్టార్టప్‌లు, యువ ఆవిష్కర్తలు పాల్గొని మొత్తం 2,132 ఆవిష్కరణలు రూపొందించారు. 

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జయేశ్ రంజన్, ఐఏఎస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (క్రీడలు), తెలంగాణ ప్రభుత్వం, ఈ కార్యక్రమాన్ని అభినందిస్తూ యువతలో సృజనాత్మకతను వెలికితీసే ఇలాంటి వేదికలు అత్యంత అవసరమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఉప సభాపతి బండా ప్రకాశ్, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తదితర ప్రముఖులు కూడా పాల్గొన్నారు.

ఈ హ్యాకథాన్‌లో ప్రత్యేకత ఏమిటంటే, కరాటే, వాలీబాల్, స్విమ్మింగ్, ఫెన్సింగ్, పవర్‌లిఫ్టింగ్, చెస్, క్యారమ్ వంటి మొత్తం 24 క్రీడలు భాగస్వామ్యం కావడం. పాల్గొన్న వారు క్రీడల్లో పాల్గొంటూనే వాటిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటికి వినూత్న పరిష్కారాలను ఆవిష్కరించారు. ఈ ఆలోచనలను “పిచ్ అరేనా” వేదికపై నిపుణులు, అధికారులు, పెట్టుబడిదారుల ముందు ప్రదర్శించారు.

హ్యాకథాన్‌లో వచ్చిన ఆవిష్కరణలు క్రీడల పనితీరు మెరుగుదల, శిక్షణ విధానాలు, ఫ్యాన్ ఎంగేజ్‌మెంట్, స్పోర్ట్స్ టెక్నాలజీ వంటి విభాగాల్లో కొత్త దారులను చూపిస్తున్నాయి. ఈ 2,132 ఆవిష్కరణలను సావనీర్ రూపంలో ప్రచురించేందుకు నిర్వాహకులు ప్రణాళిక రూపొందించారు.

హ్యాకథాన్ బ్రాండ్ ఓనర్ సందీప్ కుమార్ మక్తాల మాట్లాడుతూ... 'క్రీడలు కేవలం ఆటలకే పరిమితం కావు. అవి ఆవిష్కరణలకు కూడా మార్గం చూపుతాయి. ఈ హ్యాకథాన్ ద్వారా యువతలో ఉన్న అపార సృజనాత్మకత వెలుగులోకి వచ్చింది. ఈ ఆవిష్కరణలను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మా లక్ష్యం' అని తెలిపారు.

చదవండి: రంగుమారిన మరుక్షణం మాట మార్చాడు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement