న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సంచలన నిర్ణయం.. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత? | Sophie Devine set to step down as T20I captain after ICC Womens T20 World Cup | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ కెప్టెన్‌ సంచలన నిర్ణయం.. టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత?

Aug 30 2024 3:06 PM | Updated on Aug 30 2024 7:01 PM

Sophie Devine set to step down as T20I captain after ICC Womens T20 World Cup

న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు కెప్టెన్ సోఫీ డివైన్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది ఆక్టోబ‌ర్‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత కివీస్ టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలిగ‌న‌ట్లు  డివైన్ ప్ర‌క‌టించింది. వ‌న్డేల్లో మాత్రం కెప్టెన్‌గా కొన‌సాగ‌నున్న‌ట్లు సోఫీ తెలిపింది.

త‌న వ‌ర్క్‌లోడ్‌ను తగ్గించుకునేందుకు ఆమె ఈ నిర్ణ‌యం తీసుకుంది. కాగా డివైన్ ప్ర‌పంచంలోనే అత్యుత్త‌మ మ‌హిళా క్రికెట‌ర్ల‌లో ఒక‌రిగా గుర్తింపు తెచ్చుకుంది. అంత‌ర్జాతీయ టీ20ల్లో అత్య‌ధిక ప‌రుగులు చేసిన రెండువ మ‌హిళ క్రికెట‌ర్‌గా ఆమె కొన‌సాగుతోంది. 

డివైన్ ఇప్ప‌టివ‌ర‌కు 135 టీ20లు ఆడి 3268 ప‌రుగులు చేసింది. అయితే కెప్టెన్సీ మాత్రంలో త‌న మార్క్‌ను డివైన్ చూపించ‌లేక‌పోయింది. త‌న సార‌థ్యంలో ఇప్ప‌టివ‌ర‌కు 56 టీ20లు న్యూజిలాండ్‌.. 25 మ్యాచ్‌ల్లో విజ‌యం సాధించ‌గా, 28 మ్యాచ్‌ల్లో ఓట‌మి చ‌విచూసింది.

"రెండు ఫార్మాట్లలో వైట్ ఫెర్న్‌ల(న్యూజిలాండ్ మ‌హిళ‌ల జ‌ట్టు)కు కెప్టెన్‌గా వ్యవహరించే అవకాశం లభించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. కెప్టెన్సీతో అద‌న‌పు ప‌నిభారం ప‌డుతోంది. దాన్ని నేను ఆస్వాదించాను. కానీ కొన్ని సార్లు ఛాలెంజింగ్ గా ఉంటుంది. 

కెప్టెన్సీ కార‌ణంగా నా వ్య‌క్తిగ‌త ప్ర‌ద‌ర్శ‌న‌లో ఒత్తిడి ఎదుర్కొంటున్నాను. రెండూ బ్యాలెన్స్ చేయ‌డం కొంచెం క‌ష్టంగా ఉంది. దీంతో టీ20 కెప్టెన్సీని వ‌దులుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఆ త‌ర్వాత నా ఆట‌పై మరింత దృష్టి సారిస్తాను.

కొత్తగా ఎవరు జట్టు బాధ్యతలను చేపట్టిన వారికి అన్నిరకాలగా సపోర్ట్‌గా ఉంటాను. అయితే వన్డేల్లో మాత్రం సారథిగా కొనసాగుతున్నాను. వన్డే కెప్టెన్సీ వదులుకోవడానికి మరి కొంత సమయం పడుతోందని" ఓ ప్రకటలో డివైన్ పేర్కొంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement