SL VS AUS 2nd Test: ఆసీస్‌ను 'ఆరే'సిన జయసూర్య.. అరంగేట్రం మ్యాచ్‌లోనే రెచ్చిపోయిన లంక స్పిన్నర్

SL VS AUS 2nd Test: Prabath Jayasuriya Bags Six Wickets In Debut - Sakshi

Prabath Jayasuriya: గాలే వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో లంక లెఫ్ట్‌ ఆర్మ్‌ ఆర్థోడాక్స్‌ స్పిన్నర్‌ ప్రభాత్‌ జయసూర్య అదరగొట్టాడు. అరంగేట్రం మ్యాచ్‌లోనే ఆరు వికెట్ల ప్రదనర్శనతో రెచ్చిపోయాడు. ఆసీస్‌ బ్యాటింగ్‌ లైనప్‌ను తన స్పిన్‌ మాయాజాలంతో ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఫలితంగా పర్యాటక ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 364 పరుగులకు ఆలౌటైంది. జయసూర్య తన డెబ్యూ ఇన్నింగ్స్‌లో 36 ఓవర్లలో 118 పరుగులిచ్చి ఆరు వికెట్లు పడగొట్టాడు. 

ఓవర్‌నైట్‌ స్కోర్‌ 298/5 వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. జయసూర్య మాయాజాలం ధాటికి మరో 66 పరుగులు మాత్రమే జోడించి మిగిలిన 5 వికెట్లు కోల్పోయింది. సెంచరీ హీరో స్టీవ్‌ స్మిత్‌ (145 నాటౌట్‌) ఓవర్‌నైట్‌ స్కోర్‌కు మరో 36 పరుగులు జోడించి అజేయంగా నిలువగా.. మిగిలిన ఆటగాళ్లంతా పెవిలియన్‌కు క్యూ కట్టారు. లంక రెండో రోజు పడగొట్టిన 5 వికెట్లలో జయసూర్యకు 3 వికెట్లు దక్కాయి. 

లంక బౌలర్లలో జయసూర్య 6, రజిత 2, ఆర్‌ మెండిస్‌, తీక్షణ తలో వికెట్‌ పడగొట్టారు. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ ప్రారంభించిన లంక జట్టు లంచ్‌ సమయానికి వికెట్‌ నష్టపోకుండా 8 పరుగులు చేసింది. అంతకుముందు తొలి రోజు ఆటలో స్మిత్‌తో పాటు మార్నస్‌ లబుషేన్‌ (156 బంతుల్లో 104; 12 ఫోర్లు) సెంచరీ సాధించిన విషయం తెలిసిందే. వీరిద్దరు మూడో వికెట్‌కు 134 పరుగులు జోడిండి ఆసీస్‌ను ఆదుకున్నారు. 
చదవండి: దినేశ్‌ కార్తీక్‌కు వింత అనుభవం.. తన డెబ్యూ మ్యాచ్‌లో ప్లేయర్‌ ఇప్పుడు..!

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top