చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా | India Vs New Zealand Highlights, ICC ODI World Cup 2023: Shubman Gill Becomes Fastest To Score 2000 ODI Runs Against New Zealand - Sakshi
Sakshi News home page

WC 2023: చరిత్ర సృష్టించిన శుబ్‌మన్‌ గిల్‌.. ప్రపంచంలోనే తొలి బ్యాటర్‌గా

Oct 22 2023 9:42 PM | Updated on Oct 23 2023 11:25 AM

Shubman Gill becomes fastest batter to 2000 ODI runs - Sakshi

అంతర్జాతీయ వన్డేల్లో టీమిండియా యువ ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ అరుదైన ఘనత సాధించాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 2000 పరుగుల మార్క్‌ను అందుకున్న బ్యాటర్‌గా గిల్‌ రికార్డులకెక్కాడు. వన్డే ప్రపంచకప్‌-2023లో భాగంగా ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో గిల్‌ ఈ ఘనత సాధించాడు. 14 పరుగుల వద్ద గిల్‌ ఈ మైలు రాయిని అందుకున్నాడు.

కాగా గిల్ కేవలం 38 ఇన్నింగ్స్లలోనే 2 వేల పరుగులు సాధించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం హషీమ్ ఆమ్లా పేరిట ఉంది. ఆమ్లా 40 ఇన్నింగ్స్ లలో 2,000 పరుగులు చేశాడు. 2011 జనవరి 11న  పోర్ట్ ఎలిజబెత్‌లో భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో హషీమ్ ఆమ్లా ఈ ఫీట్‌  సాధించాడు. తాజా మ్యాచ్‌తో ఆమ్లా 12 ఏళ్ల రికార్డును గిల్‌ బ్రేక్‌ చేశాడు. ఇప్పటివరకు అంతర్జాతీయ  38 వన్డేలు ఆడిన గిల్‌ 2012 పరుగులు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement