AFG Vs BAN: అఫ్గన్‌తో మ్యాచ్‌.. అరుదైన ఘనత అందుకోనున్న బంగ్లా కెప్టెన్‌

Shakib Al Hasan Set 100th-T20I Appearance Vs AFG Match Asia Cup 2022 - Sakshi

ఆసియా కప్‌లో భాగంగా గ్రూఫ్‌-బిలో మంగళవారం అఫ్గనిస్తాన్‌, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాచ్‌ జరగనుంది.  ఇప్పటికే శ్రీలంకపై 8 వికెట్లతో విజయం సాధించి జోరు మీదున్న అఫ్గనిస్తాన్‌ను బంగ్లా కట్టడి చేస్తుందా అన్నది అనుమానమే. ఎందుకంటే ఇటీవలే బంగ్లా ఫామ్‌ చూసుకుంటే దారుణంగా ఉంది. జింబాబ్వేతో జరిగిన వన్డే, టి20 సిరీస్‌ను కోల్పోయిన బంగ్లాదేశ్‌ ఆటతీరు నాసిరకంగా తయారైంది. ఇక జింబాబ్వేతో సిరీస్‌ ఓటమి అనంతరం మహ్మదుల్లా కెప్టెన్సీ బాధ్యతలు నుంచి తప్పుకోవడంతో కొత్త కెప్టెన్‌గా బంగ్లా స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ను ఎంపిక చేసింది బీసీబీ(బంగ్లా క్రికెట్‌ బోర్డు).

షకీబ్‌కు తోడూ ముష్ఫికర్‌ రహీమ్‌ కూడా జట్టులోకి రావడంతో బంగ్లాదేశ్‌ జట్టు కాస్త పటిష్టంగా కనిపిస్తోంది. కానీ తొలి మ్యాచ్‌లో గెలిచి జోరు మీదున్న అఫ్గనిస్తాన్‌ను ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక బంగ్లాదేశ్‌ స్టార్‌.. కెప్టెన్‌ కమ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ హల్‌ హసన్‌ వందో టి20 మ్యాచ్‌ ఆడనున్నాడు. బంగ్లా తరపున వందో టి20 ఆడనున్న మూడో క్రికెటర్‌గా షకీబ్‌ నిలవనున్నాడు. షకీబ్‌ కంటే ముందు ముష్పికర్‌ రహీమ్‌, మహ్మదుల్లా ఈ ఘనత సాధించారు.

మరోవైపు అఫ్గనిస్తాన్‌ మాత్రం లంకపై గెలిచి ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది. టాస్‌ గెలిస్తే మాత్రం అఫ్గన్‌ మరోసారి కచ్చితంగా బౌలింగ్‌ను ఎంచుకోవడం ఖాయం. రషీద్‌ ఖాన్‌, షజల్లా ఫరూఖీ, నవీన్‌ ఉల్‌ హక్‌, మహ్మద్‌ నబీలతో బౌలింగ్‌ పటిష్టంగా కనిపిస్తుండగా.. బ్యాటింగ్‌లో హజరతుల్లా జజాయి, రహమనుల్లా గుర్బాజ్‌, ఇబ్రహం జర్దాన్‌, నజీబుల్లా జర్దాన్‌లతో బలంగా కనిపిస్తోంది. 

చదవండి: Aditya Tare: 17 ఏళ్ల బంధానికి స్వస్తి పలికిన క్రికెటర్‌

Ban Vs Afg: ఆ జట్టు అసలు గెలిచే అవకాశమే లేదు: టీమిండియా మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top