ఆఫ్ఘన్ బౌలర్‌పై ఆఫ్రిది తిట్ల పురాణం

Shahid Afridi Lashes Out Afghan Bowler Naveen ul Haq Abuse Mohammed Amir - Sakshi

కొలంబొ : శ్రీలంకలో జరుగుతున్న లంక ప్రీమియర్‌ లీగ్‌లో సోమవారం కాండీ టస్కర్స్‌, గాలే గ్లాడియేటర్స్ మధ్య మ్యాచ్‌ జరిగింది. ఈ  మ్యాచ్‌లో కాండీ టస్కర్స్‌ 25 పరుగుల తేడాతో గాలే గ్లాడియేటర్స్‌పై గెలుపొందింది. మ్యాచ్‌ ముగిసిన అనంతరం షేక్‌ హాండ్‌ ఇచ్చుకునే సందర్భంలో గ్లాడియేటర్స్‌ కెప్టెన్‌ షాహిద్‌ ఆఫ్రిది ప్రత్యర్థి ఆటగాడిపై తిట్లతో విరుచుకుపడ్డాడు. అసలు విషయంలోకి వెళితే.. గ్లాడియేటర్స్‌ ఇన్నింగ్స్‌ సందర్భంగా బ్యాటింగ్‌ చేస్తున్న మహ్మద్‌ ఆమిర్‌, టస్కర్స్‌ బౌలర్‌ నవీన్‌ హుల్‌ హక్‌ మధ్య మాటల యుద్దం చోటుచేసుకుంది. నవీన్‌ హుల్‌ హక్‌ ఆమిర్‌నుద్దేశించి స్లెడ్జింజ్‌కు పాల్పడ్డాడు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆమిర్‌ నవీన్‌వైపు దూసుకెళ్లాడు. ఇద్దరు ఒకరినొకరు తిట్టుకుంటూ కొట్టుకోవడానికి తయారయ్యారు. ఇంతలో మునాఫ్‌ పటేల్‌ సహా ఇతర ఆటగాళ్లు వారిద్దరిని అడ్డుకున్నారు. (చదవండి : బంతి పట్టనున్న శ్రీశాంత్‌.. రైనా శుభాకాంక్షలు)

మ్యాచ్‌ అనంతరం షేక్‌హ్యాండ్‌ ఇచ్చుకునే సందర్భంలో గ్లాడియేటర్‌ కెప్టెన్‌ ఆఫ్రిది అందరితో సరదాగానే చేతులు కలిపాడు. తీరా నవీన్‌ హుల్‌ హక్‌ దగ్గరకు రాగానే ముఖం కోపంగా పెట్టి..  అతనిపై విరుచుకుపడ్డాడు. ఏమైంది నీకు.. ఎందుకు అమిర్‌తో అలా ప్రవర్తించావు. ఒక సీనియర్‌ బౌలర్‌పై ఈ విధంగా వ్యవహరించడం తప్పు .. అంటూ కోపంతో పేర్కొన్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన కాండీ టస్కర్స్‌ బ్రెండన్‌ టేలర్‌, కుషాల్‌ మెండిస్‌ బ్యాటింగ్‌లో మెరవడంతో 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 196 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లాడియేటర్స్‌ 171 పరుగుల వద్దే ఆగిపోయింది. దనుష్క గుణతిలక ఒక్కడే 53 బంతుల్లో 82 పరుగులతో ఆకట్టుకున్నాడు. కెప్టెన్‌ ఆఫ్రిది గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఆఫ్రిది నాయకత్వంలోని గ్లాడియేటర్స్‌ ఆడిన మూడు మ్యాచ్‌ల్లో అన్నీ ఓడిపోయి చివరిస్థానంలో ఉండగా.. టస్కర్స్‌ మాత్రం తొలి విజయం నమోదు చేసింది. కాగా ఎల్‌పీఎల్‌లో మొదటిస్థానంలో జఫ్నా స్టాలియన్స్‌ మొదటిస్థానంలో ఉండగా.. కొలంబొ కింగ్స్‌ రెండో స్థానంలో కొనసాగుతుంది. (చదవండి : సచిన్, సెహ్వాగ్‌ లాంటి ఆటగాళ్లు టీంలో లేరు..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top