'సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా అతడే ఉండాలి'.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు | Sehwag delivers verdict on SRHs leadership conundrum ahead of IPL 2026 match against RR | Sakshi
Sakshi News home page

IPL 2026: 'సన్‌రైజర్స్‌ కెప్టెన్‌గా అతడే ఉండాలి'.. సెహ్వాగ్ సంచలన వ్యాఖ్యలు

Apr 25 2026 4:24 PM | Updated on Apr 25 2026 5:14 PM

Sehwag delivers verdict on SRHs leadership conundrum ahead of IPL 2026 match against RR

ఆస్ట్రేలియా దిగ్గ‌జం, స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్ పాట్ క‌మ్మిన్స్ ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మ‌య్యాడు. శ‌నివారం జైపూర్ వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో జ‌ర‌గ‌నున్న‌ మ్యాచ్‌లో క‌మ్మిన్స్ బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మైంది. దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇషాన్ కిష‌న్ త‌న బాధ్య‌త‌ల‌ను క‌మ్మిన్స్‌కు అప్ప‌గించే అవ‌కాశ‌ముంది.

అయితే క‌మ్మిన్స్ గైర్హ‌జారీలో స‌న్‌రైజర్స్ జ‌ట్టును కిష‌న్ అద్బుతంగా న‌డిపించాడు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో హైదరాబాద్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. కెప్టెన్‌గా, బ్యాట‌ర్‌గా కిష‌న్ విజ‌య‌వంత‌మ‌య్యాడు. దీంతో క‌మ్మిన్స్ తిరిగొచ్చినా కెప్టెన్‌గా కిష‌న్‌నే కొన‌సాగించాల‌ని చాలా మంది మాజీలు సూచిస్తున్నారు. కానీ టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద‌ర్ సెహ్వాగ్ ఇందుకు విరుద్ధంగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ఇషాన్ కిషన్ నుంచి కెప్టెన్సీ బాధ్యతలను క‌మ్మిన్స్‌ తిరిగి తీసుకోవాలని సెహ్వాగ్ తెలిపాడు.

"క‌మ్మిన్స్ తిరిగి రావ‌డం ఎస్ఆర్‌హెచ్‌కు అతిపెద్ద ప్లస్ పాయింట్. అయితే కిషన్ నుంచి క‌మ్మిన్స్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు తీసుకోవాలి. క‌మ్మిన్స్ జ‌ట్టుకు దూరంగా ఉండ‌టం వ‌ల్లే ఇషాన్ కిష‌న్‌కు కెప్టెన్సీ బాధ్య‌త‌లు ఇచ్చారు. ఇప్పుడు క‌మ్మిన్స్ తిరిగి అందుబాటులోకి వ‌చ్చాడు. కాబ‌ట్టి అత‌డే జ‌ట్టును న‌డిపించాలి. 

క‌మ్మిన్స్ ఒక సీనియ‌ర్ కెప్టెన్ మాత్ర‌మే అద్బుత‌మైన ఆల్‌రౌండ‌ర్ కూడా. స‌రైన స‌మ‌యంలో క‌మ్మిన్స్ అందుబాటులోకి వ‌చ్చాడు. అయితే క‌మ్మిన్స్ ప్లేయింగ్ ఎలెవ‌న్‌లోకి ఎవ‌రి స్ధానంలో వ‌స్తాడ‌న్న‌దే ప్ర‌శార్ధ‌కంగా మారింది. అతడిని మ‌ధుశంక స్ధానంలో తుది జ‌ట్టులోకి తీసుకునే అవ‌కాశ‌ముంది" క్రిక్‌బ‌జ్ షోలో సెహ్వాగ్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: సీఎస్‌కేకు భారీ షాక్‌.. జట్టును వదిలి వెళ్లిపోయిన కెప్టెన్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement