ఐపీఎల్-2026లో ముంబై ఇండియన్స్‌పై ఘన విజయం సాధించిన చెన్నై సూపర్ కింగ్స్.. ఇప్పుడు మరో కీలక పోరుకు సన్నద్దమవుతోంది. ఈ టోర్నీలో భాగంగా ఆదివారం(ఏప్రిల్ 26) చెపాక్ స్టేడియం వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో సీఎస్‌కే తలపడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు చెన్నై జట్టుకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది.
కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కుటుంబ అత్యవసర పరిస్థితి (Family Emergency) కారణంగా సీఎస్‌కే జట్టును వీడి పుణేకు వెళ్లినట్లు తెలుస్తోంది. దీంతో అతడు జట్టుతో పాటు చెన్నైకి ప్రయాణించలేదు. అయితే అతడు తిరిగి ఎప్పుడు జట్టుతో చేరుతాడన్న విషయంపై క్లారిటీ లేదు. కానీ సీఎస్‌కే అభిమానులు మాత్రం వీలైనంత త్వరగా రుతురాజ్ జట్టుతో కలవాలని కోరుకుంటున్నారు.
మరోవైపు సీఎస్‌కే లెజండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని.. గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఆడనున్నట్లు సమాచారం. సీఎస్‌కే హెడ్ కోచ్ మైఖల్ హస్సీ సైతం ధోని రీఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతాలు ఇచ్చాడు.
ఒకవేళ రుతురాజ్ గుజరాత్‌తో మ్యాచ్‌కు అందుబాటులో లేకపోతే ఎంఎస్ ధోని మరోసారి జట్టు పగ్గాలు చేపట్టే అవకాశముంది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు 7 మ్యాచ్‌లు ఆడిన సూపర్ కింగ్స్.. మూడింట విజయం సాధించి పాయింట్ట పట్టికలో ఐదో స్ధానంలో కొనసాగుతోంది.
చదవండి: వైభవ్ సూర్యవంశీ వద్దు!.. ఆ ఇద్దరిని సెలక్ట్ చేయండి!


