సీఎస్‌కే తుది జట్టు ఇదే.. రూ. 14 కోట్ల ఆటగాడికి ఛాన్స్‌? | RR vs CSK Playing 11, IPL 2026 Today Match | Sakshi
Sakshi News home page

IPL 2026: సీఎస్‌కే తుది జట్టు ఇదే.. రూ. 14 కోట్ల ఆటగాడికి ఛాన్స్‌?

Mar 30 2026 5:19 PM | Updated on Mar 30 2026 5:57 PM

RR vs CSK Playing 11, IPL 2026 Today Match

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌లో చెన్నై సూప‌ర్ కింగ్స్ త‌మ తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ద‌మైంది. గౌహ‌తి వేదిక‌గా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌తో సీఎస్‌కే త‌ల‌ప‌డ‌నుంది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు గ‌ట్టి ఎదురు దెబ్బ త‌గిలింది. లెజెండ‌రీ వికెట్ కీప‌ర్ బ్యాట‌ర్ ఎంఎస్ ధోని, విధ్వ‌సంక‌ర బ్యాట‌ర్ డెవాల్డ్ బ్రెవిస్ గాయం కార‌ణంగా సీఎస్‌కే ఆడే కొన్ని మ్యాచ్‌ల‌కు దూర‌మ‌య్యారు. 

దీంతో జ‌ట్టు బాధ్యత మొత్తం సంజూ శాంస‌న్‌, కెప్టెన్‌ రుతురాజ్ గైక్వాడ్‌పైనే ప‌డింది. ఈ క్ర‌మంలో రాజ‌స్తాన్‌తో జ‌రిగే తొలి మ్యాచ్‌లో సీఎస్‌కే ప్లేయింగ్ ఎలెవ‌న్‌లో ఎలా ఉండ‌బోతుందో ఓ లుక్కేద్దాం. ఈ మ్యాచ్‌లో యువ ఆట‌గాడు ప్ర‌శాంత్ వీర్ అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది.

గ‌తేడాది డిసెంబ‌ర్‌లో జ‌రిగిన మినీ వేలంలో ప్ర‌శాంత్ వీర్‌ను రూ. 14.2 కోట్ల భారీ ధ‌ర వెచ్చించి మ‌రి సీఎస్‌కే కొనుగోలు చేసింది. ఈ 20 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ ఆల్‌రౌండ‌ర్‌ను ర‌వీంద్ర జ‌డేజాకు ప్రత్యామ్నాయంగా తీసుకున్నారు.  ఈ ఏడాది సీజ‌న్‌కు ముందు జ‌డేజా సీఎస్‌కే నుంచి రాజ‌స్తాన్‌కు ట్రేడ్ అయిన సంగ‌తి తెలిసిందే. 

అదేవిధంగా ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ మ‌థ్యూ షార్ట్‌, ఇంగ్లండ్ పేస‌ర్ జేమీ ఓవ‌ర్ట‌న్ సీఎస్‌కే త‌ర‌పున ఐపీఎల్ అరంగేట్రం చేసే అవ‌కాశ‌ముంది. అన్షుల్ కాంబోజ్‌, ఖలీల్ అహ్మ‌ద్ పేస్ బౌలింగ్ బాధ్య‌త‌ల‌ను పంచుకోనున్నారు. స్పిన్న‌ర్ల‌గా నూర్ అహ్మ‌ద్‌, రాహుల్ చాహ‌ర్ తుది జ‌ట్టులో చోటు ద‌క్కించుకునే సూచ‌న‌లు క‌న్పిస్తున్నాయి. సీఎస్‌కే బ్యాటింగ్‌ను సంజూ శాంస‌న్‌, రుతురాజ్ గైక్వాడ్ ప్రారంభించ‌నున్నారు.

సీఎస్‌కే తుది జ‌ట్టు(అంచ‌నా) 
సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్‌), ఆయుష్ మాత్రే, మాథ్యూ షార్ట్, శివమ్ దూబే, ప్రశాంత్ వీర్, జామీ ఓవర్టన్, అన్షుల్ కాంబోజ్, రాహుల్ చాహర్, నూర్ అహ్మద్, ఖలీల్ అహ్మద్

రాజ‌స్తాన్ తుది జ‌ట్టు(అంచ‌నా): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (కెప్టెన్‌), షిమ్రోన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్ (వికెట్ కీప‌ర్‌), రవీంద్ర జడేజా, దాసున్ షనక, జోఫ్రా ఆర్చర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, ఆడమ్ మిల్నే

Advertisement
 
Advertisement
Advertisement