IPL 2022: 'మ్యాచ్ గెలవడం కంటే నీ ఈగో ముఖ్యమా'

RP Singh slams Rishabh Pant for irresponsible cricket against PBKS - Sakshi

ఐపీఎల్‌-2022లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఔటైన తీరుపై టీమిండియా మాజీ ఆటగాళ్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్‌లో పంత్‌ నిర్లక్షమైన షాట్‌ ఆడటానికి ప్రయత్నించి ఔటయ్యాడు. ఇన్నింగ్స్‌ 11 ఓవర్‌ చివరి బంతికి లలిత్ యాదవ్ ఔటైన తర్వాత పంత్‌ క్రీజులోకి వచ్చాడు. పంత్‌ ఎదుర్కొన్న మొదటి బంతికే సింగిల్ తీశాడు. అయితే మళ్లీ స్ట్రైక్‌లోకి వచ్చిన పంత్.. లివింగ్‌స్టోన్ వేసిన బంతిని సిక్సర్‌గా మలిచాడు.  అయితే తర్వాతి బంతిని వేయడానికి సిద్దమైన లివింగ్‌స్టోన్.. కొన్ని కారణాల వల్ల రన్-అప్‌ మధ్యలో ఆగిపోయాడు.

కాగా పంత్‌ ఫ్రంట్‌ ఫుట్‌కు వచ్చి ఆడటానికి సిద్దమైనట్లు అనిపించింది. అయితే అది గమనించిన లివింగ్‌స్టోన్ తెలివిగా తరువాతి బంతిని వైడ్‌గా వేసి పంత్‌ను స్టంపౌట్ చేశాడు. పంత్‌ ఔటయ్యాక వరుస క్రమంలో ఢిల్లీ వికెట్లు కోల్పోయింది. జట్టును ముందుండి నడిపించాల్సిన సమయంలో బాధ్యత రహితంగా ఆడిన పంత్‌పై విమర్శలు  వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలో భారత మాజీ బౌలర్‌ ఆర్పీ సింగ్‌ సంచలన వాఖ్యలు చేశాడు.

"మ్యాచ్ గెలవడం కంటే మన ఈగో ముఖ్యమా? ఆప్పటికే పంజాబ్‌ మ్యాచ్‌పై పట్టు బిగిస్తోంది. లలిత్‌ యాదవ్‌ను నిందించలేము. ఎందుకంటే అతడికి అంత అనభవం లేదు. వికెట్లు పడుతున్న సమయంలో పంత్‌ మరింత బాధ్యతగా ఆడాల్సింది. లివింగ్‌స్టోన్ ట్రాప్‌ చేశాడు. పంత్‌ అతడి ట్రాప్‌లో పడిపోయాడు. లివింగ్‌స్టోన్ రెగ్యూలర్‌ బౌలర్‌ కూడా కాదు. లివింగ్‌స్టోన్ తెలివిగా పంత్‌ టెంపర్‌కు తగ్గట్టు బౌలింగ్‌ చేశాడు. చివరికి అతడి ఈగోపై లివింగ్‌స్టోన్ విజయం సాధించాడు" అని ఆర్పీ సింగ్‌ పేర్కొన్నాడు.

చదవండి: Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top