Kane Williamson: ఇంకెంత కాలం విలియమ్సన్‌ను భరిస్తారు.. తుది జట్టు నుంచి తప్పించండి!

IPL 2022: RP Singh Says SRH Should Consider Dropping Kane Williamson - Sakshi

IPL 2022- Kane Williamson: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరుపై టీమిండియా మాజీ క్రికెటర్‌ ఆర్పీ సింగ్‌ విమర్శలు గుప్పించాడు. పవర్‌ప్లేలో ఆడే అవకాశాన్ని సరిగా వినియోగించుకోలేకపోతున్నాడని పెదవి విరిచాడు. ఇకనైనా అతడిని తుది జట్టు నుంచి తప్పించాలని సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి సూచించాడు. 

కాగా ఐపీఎల్‌-2022 సీజన్‌లో కేన్‌ మామ బ్యాటర్‌గా విఫలమవుతున్నాడు. ఈ ఎడిషన్‌లో ఇప్పటి వరకు ఆడిన 12 మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు మొత్తం కలిపి 208. అత్యధిక స్కోరు 57. అంటే కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరు ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.   

ఈ నేపథ్యంలో ఆర్పీ సింగ్‌.. కేన్‌ విలియమ్సన్‌ ఆట తీరు గురించి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘విలియమ్సన్‌ జట్టులో ఉంటే బాగుంటుంది. అయితే, అతడిని తుది జట్టు నుంచి తప్పించినా బాగానే ఉంటుంది. ఇంకెంత కాలం అతడిని భరిస్తారు? తనొక ప్రొఫెషనల్‌ క్రికెటర్‌. కానీ స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేకపోతున్నాడు. ఇప్పుడు కూడా అతడిని కొనసాగించాలా?

కేన్‌ విలియమ్సన్‌ మంచి వ్యక్తి. గొప్ప కెప్టెన్‌ కూడా! కానీ ఓపెనర్‌గా రాణించలేకపోతున్నాడు. ఇప్పటికీ జట్టులో మార్పులు చేయకపోతే కష్టం. అభిషేక్‌ శర్మతో కలిసి రాహుల్‌ త్రిపాఠిని ఓపెనింగ్‌కు దింపండి’’ అని సన్‌రైజర్స్‌ యాజమాన్యానికి సూచించాడు.

ఇక భారత మాజీ లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా సైతం ఓపెనర్‌గా విలియమ్సన్‌ పెద్దగా ఆకట్టుకోవడం లేదని, అతడు మిడిలార్డర్‌లో ఫిట్‌ అవుతాడని అభిప్రాయపడ్డాడు. కాగా సన్‌రైజర్స్‌ మంగళవారం(మే 17) ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తేనే ప్లే ఆఫ్స్‌ రేసులో నిలిచే అవకాశం రైజర్స్‌కు ఉంటుంది.

చదవండి👉🏾IPL 2022- MI Vs SRH: అతడి వల్లే ఇదంతా.. సన్‌రైజర్స్‌ మిగిలిన రెండు మ్యాచ్‌లు గెలవడం కష్టమే! ఎందుకంటే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

17-05-2022
May 17, 2022, 15:37 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఔటైన తీరుపై టీమిండియా...
17-05-2022
May 17, 2022, 15:33 IST
IPL 2022- GT Teammates Video Viral: ఐపీఎల్‌ అరంగేట్ర సీజన్‌లోనే అద్బుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది గుజరాత్‌ టైటాన్స్‌. టీమిండియా...
17-05-2022
May 17, 2022, 14:22 IST
ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో దక్షిణాఫ్రికా పేసర్‌ కగిసో రబాడ అరుదైన రికార్డు నెలకొల్పాడు. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో అత్యధిక వికెట్లు...
17-05-2022
May 17, 2022, 13:43 IST
ఐపీఎల్‌ 2022 ప్లే ఆఫ్స్‌ సమీకరణలు రసవత్తరంగా మారాయి. నిన్న (మే 16) పంజాబ్‌ను ఢిల్లీ మట్టికరిపించడంతో సమీకరణలు మారిపోయాయి....
17-05-2022
May 17, 2022, 13:07 IST
IPL 2022 MI Vs SRH: వరుసగా ఐదు పరాజయాలతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలు సంక్లిష్టం చేసుకుంది సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌...
17-05-2022
May 17, 2022, 13:04 IST
ఐపీఎల్‌-2022 చివరి అంకానికి చేరుకుంది. ఆయా జట్లు తమ అఖరి లీగ్‌ మ్యాచ్‌ల్లో తలపడతున్నాయి. కొన్ని జట్లు ప్లే ఆఫ్‌...
17-05-2022
May 17, 2022, 12:09 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా సోమవారం (మే 16) ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌ 17 పరుగుల తేడాతో పరజాయం...
17-05-2022
May 17, 2022, 11:30 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా సోమవారం (మే 16) పంజాబ్‌ కింగ్స్‌ తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగుల తేడాతో...
17-05-2022
May 17, 2022, 10:44 IST
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన రెండో లెప్ట్మ్‌...
17-05-2022
May 17, 2022, 10:34 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో బ్యాటర్ల హవా కొనసాగుతుంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లో బ్యాటర్లు ఏయేటికాయేడు రెచ్చిపోతున్నారు. బౌలింగ్‌లో అడపాదడపా ప్రదర్శనలు...
17-05-2022
May 17, 2022, 10:12 IST
ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ గాయం కారణంగా ఐపీఎల్‌-2022 నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో...
17-05-2022
May 17, 2022, 05:33 IST
ముంబై: కీలకమైన పోరులో ఢిల్లీ క్యాపిటల్స్‌ 17 పరుగులతో పంజాబ్‌ కింగ్స్‌ను ఓడించి ఐపీఎల్‌ టోర్నీలో ముందడుగు వేసింది. తొలుత...
16-05-2022
May 16, 2022, 22:00 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ గోల్డన్‌ డక్‌గా వెనుదిరిగాడు. లివింగ్‌స్టోన్‌ వేసిన...
16-05-2022
16-05-2022
May 16, 2022, 18:10 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌కు కోల్‌కతా నైట్ రైడర్స్‌కు భారీ షాక్‌ తగిలింది. ఆ జట్టు ఓపెనర్‌ అజింక్య...
16-05-2022
May 16, 2022, 17:43 IST
ఐపీఎల్‌-2022లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ యువ పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ తన పేస్‌ బౌలింగ్‌తో ప్రత్యర్ది బ్యాటర్లకు ముప్పుతిప్పలు పెడుతున్నాడు. ఈ...
16-05-2022
May 16, 2022, 16:52 IST
రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర ఆటగాడు షిమ్రాన్ హెట్‌మైర్‌ తిరిగి జట్టు బయో-బబుల్‌లో చేరాడు. మే 20న చెన్నై సూపర్ కింగ్స్‌తో...
16-05-2022
May 16, 2022, 11:12 IST
DC VS PBKS Predicted Playing XI: ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఇవాళ (మే 16) మరో బిగ్‌ ఫైట్‌...
16-05-2022
May 16, 2022, 06:07 IST
ముంబై: లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఆదివారం జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ 24 పరుగుల తేడాతో గెలిచి ప్లేఆఫ్స్‌కు...
15-05-2022
May 15, 2022, 21:17 IST
ఐపీఎల్‌లో శ్రీలంక యువ పేసర్‌ మతీషా పతిరనా చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం... 

Read also in:
Back to Top