SA vs WI: పావెల్‌ విధ్వంసం.. దక్షిణాఫ్రికాపై వెస్టిండీస్‌ సంచలన విజయం

Rovman Powell fires as West Indies beat South Africa - Sakshi

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో వెస్టిండీస్‌ సంచలన విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ప్రోటీస్‌ బ్యాటర్లలో డేవిడ్‌ మిల్లర్‌ అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. అతడు కేవలం 22 బంతుల్లోనే 48 పరుగులు సాధించాడు. మిల్లర్‌ ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 3 భారీ సిక్సర్లు ఉన్నాయి.  విండీస్‌ బౌలర్లలో కాట్రల్‌, స్మిత్‌ తలా రెండు వికెట్లు సాధించగా.. జోషఫ్‌, హోస్సేన్‌, షెపర్డ్ చెరో వికెట్‌ సాధించారు.

అనంతరం 132 పరుగుల భారీ లక్ష్యంతో  బరిలోకి దిగిన వెస్టిండీస్‌ 7 వికెట్లు కోల్పోయి మరో మూడు బంతులు మిగిలూండగానే ఛేదించింది. విండీస్‌ కెప్టెన్‌ రోవమన్‌ పావెల్‌(18 బంతుల్లో 42 పరుగులు) ఆఖరి వరకు క్రీజులో నిలిచి తమ జట్టుకు అద్భుతమైన విజయాన్ని అందించాడు. పావెల్‌తో పాటు చార్లెస్‌ (14 బంతుల్లో 28) పరుగులతో రాణించాడు. కాగా ప్రోటీస్‌ బౌలర్లలో మగాల మూడు వికెట్లు సాధించాడు. ఇక ఇరు జట్ల మధ్య రెండో టీ20 ఆదివారం జరగనుంది.
చదవండి: SA vs WI: డేవిడ్‌ మిల్లర్‌ విధ్వంసం.. కేవలం 22 బంతుల్లోనే!

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top