ఆర్సీబీకి భారీ షాక్‌.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్‌ ప్లేయర్‌ దూరం | RCB End Suspense On Josh Hazlewood's Availability For IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ఆర్సీబీకి భారీ షాక్‌.. ఆరంభ మ్యాచ్‌లకు స్టార్‌ ప్లేయర్‌ దూరం

Mar 24 2026 4:53 PM | Updated on Mar 24 2026 5:02 PM

RCB End Suspense On Josh Hazlewood's Availability For IPL 2026

ఐపీఎల్‌-2026 సీజ‌న్‌కు ముందు డిఫెండింగ్ ఛాంపియ‌న్‌ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరును గాయాల బెడ‌ద వెంటాడుతోంది. ఆస్ట్రేలియా స్పీడ్ స్టార్ జోష్ హాజిల్‌వుడ్‌,  శ్రీలంక పేస‌ర్ నువాన్ తుషార‌లు ఇంకా జ‌ట్టుతో చేర‌లేదు. తొడ‌కండ‌రాల గాయంతో బాధ‌పడుతున్న‌ నువాన్ తుషారకు ఒక‌ట్రెండు రోజుల్లో శ్రీలంక క్రికెట్ ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు నిర్వ‌హ‌రించ‌నుంది.

ఒక‌వేళ అందులో అత‌డు పాసైతే లంక క్రికెట్ బోర్డు ఎన్‌వోసీ జారీ చేయ‌నుంది. అత‌డు దాదాపుగా పూర్తి ఫిట్‌నెస్ సాధించిన‌ట్లు తెలుస్తోంది. అయితే మోకాలి గాయంతో బాధ‌ప‌డుతున్న‌ హాజిల్‌వుడ్ మాత్రం కోలుకోవ‌డానిని మ‌రింత స‌మ‌యం ప‌ట్ట‌నున్న‌ట్లు స‌మాచారం. దీంతో ఈ ఏడాది సీజ‌న్ ఆరంభ మ్యాచ్‌ల‌కు హేజిల్‌వుడ్ అందుబాటులో ఉండ‌డం లేదు. ఈ విష‌యాన్ని ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మో బోబాట్ ధ్రువీక‌రించారు.

"జోష్ హేజిల్‌వుడ్ గాయాల కార‌ణంగా ఇటీవ‌ల పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఈ విష‌యం మ‌నందరికీ తెలుసు. అత‌డు ప్ర‌స్తుతం మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టేందుకు తీవ్రంగా శ్ర‌మిస్తున్నాడు. అత‌డు ఇంకా ఆస్ట్రేలియాలోనే ఉన్నాడు.

క్రికెట్ ఆస్ట్రేలియా  (CA) వైద్య బృందం పర్యవేక్షణలో కోలుకుంటున్నాడు. అతడి ఫిట్‌నెస్‌పై సీఏ వైద్య బృందం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే భారత్‌కు వచ్చేందుకు అనుమతి లభిస్తుంది.  క్రికెట్ ఆస్ట్రేలియాతో మేము నిరంతరం టచ్‌లో ఉన్నాము.

అయితే మా జట్టులో అభినందన్‌, రషిక్ ధార్ వంటి అద్భుతమైన డొమాస్టిక్ బౌలర్లు ఉన్నారు. అదేవిధంగా భువనేశ్వర్ కుమార్‌, జాకబ్ డ‌ఫీ వంటి అనుభ‌వం ఉన్న బౌల‌ర్లు కూడా ఉన్నారు" అని బోబాట్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2026: ముంబై తుది జట్టు ఇదే.. విధ్వంసకర ఆటగాడికి నో ఛాన్స్‌?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement