Cricketer Ravindra Jadeja's wife may get BJP ticket for Gujarat Assembly Polls
Sakshi News home page

ఎమ్మెల్యేగా పోటీ చేయ‌నున్న ర‌వీంద్ర జ‌డేజా భార్య.. ఏ పార్టీ నుంచి అంటే..?

Nov 9 2022 1:14 PM | Updated on Nov 9 2022 1:45 PM

Ravindra Jadeja Wife To Contest In Gujarat Assembly Polls On BJP Ticket Says Sources - Sakshi

Ravindra Jadeja: ఈ ఏడాది డిసెంబర్‌లో (1, 5 తేదీల్లో) జరుగనున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై తుది నిర్ణయం ఇవాళ (నవంబర్‌ 9) సాయంత్రం కంతా వెలువడే అవకాశం ఉంది. గుజరాత్‌ అసెంబ్లీకి పోటీ చేయబోయే మొత్తం 182 మంది అభ్యర్ధుల జాబితాను అధిష్టానం ఇవాళ సాయంత్రానికి ఫైనల్‌ చేయనుందని సమాచారం. ఈ జాబితాలో రివాబా పేరు తప్పక ఉండనుందని జడేజా కుటుంబసభ్యులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

మూడేళ్ల క్రితం బీజేపీలో చేరిన రివాబా.. నాటి నుంచి స్థానిక రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంది. రివాబా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత హరి సింగ్‌ సోలంకీకి బంధువు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌ విద్యనభ్యసించిన రివాబా.. 2016లో రవీంద్ర జడేజాను పెళ్లాడింది. ఆమె రాజ్‌పుత్‌ల అనుబంధ సంస్థ కర్ణి సేనలో క్రియాశీలకంగా వ్యవహరించింది. 

ఇదిలా ఉంటే, గుజరాత్‌లో గత 27 ఏళ్లుగా అధికారం‍లో ఉన్న బీజేపీ, ఆసారి కాస్త గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటుంది. కొత్తగా ఆప్‌ స్థానిక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడం, కాంగ్రెస్‌పై సానుభూతి పెరగడం వంటి ఈక్వేషన్స్‌ మధ్య బీజేపీ ఈసారి అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనుంది.  75 ఏళ్లు పైబడిన వారికి టికెట్లు లేవని హైకమాండ్‌ స్పష్టం చేయడంతో.. ముఖ్యమంత్రి విజయ్‌ రుపానీ, మాజీ డిప్యూటీ సీఎం నితిన్‌ పటేల్‌ తదితర సీనియర్‌ నేతలు పోటీకి దూరంగా ఉండనున్నారు.  సొంత రాష్ట్రం కావడంతో ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా ఈ ఎన్నికలను క్లోజ్‌గా అబ్జర్వ్‌ చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement