నాలుగేళ్ల తర్వాత జట్టులో ఎంట్రీ.. అశ్విన్‌ భావోద్వేగ ట్వీట్

Ravichandran Ashwin: Happiness and Gratitude Define Me Right Now - Sakshi

లండన్‌: వచ్చే నెలలో జరగనున్న టి20 ప్రపంచకప్‌ కోసం 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నాలుగేళ్ల తర్వాత అశ్విన్‌కి టీ20 జట్టులో చోటు దక్కింది. ఈ సందర్భంగా అశ్విన్‌ భావోద్వేగ ట్వీట్ చేశాడు. ఇంతకీ ఆ ట్వీట్‌లో ఏముందంటే..  "ప్రతీ చీకటి వెనుక వెలుగు తప్పక ఉంటుంది. అయితే ఆ వెలుతురు చూడగలనని నమ్మినవాడే ఆ చీకటి ప్రయాణాన్ని తట్టుకుని నిలబడతాడు." అని ఆశ్విన్‌ రాసుకోచ్చాడు.

సంతోషం, కృతజ్ఞత అనే రెండు పదాలు తనేంటో నిర్వచిస్తాయని ఆశ్విన్‌ అన్నాడు. ఈ కోట్‌ను గోడమీద పెట్టక ముందే నా డైరీలో కొన్ని లక్షలు సార్లు రాసుకున్నాను. మనం చదివే మంచి మాటలను తప్పని సారిగా పాటిస్తే జీవితంలో ఏదో ఒక చోట మనకు ప్రేరణ కలిగిస్తాయని ఆశ్విన్‌ అంటున్నాడు. ఇక  ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న ఆశ్విన్‌.. మెదటి  నాలుగు టెస్టులకు  రిజర్వ్‌ బెంచ్‌కే పరిమితం అయ్యాడు. కాగా ఆశ్విన్‌ చివరసారిగా 2017లో టి20 మ్యాచ్‌ ఆడాడు. 46 టీ20ల్లో 52 వి​కెట్లు  ఆశ్విన్‌ పడగొట్టాడు.

భారత టీ20 ప్రపంచకప్‌ జట్టు: విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషబ్‌ పంత్‌(వికెట్‌కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌కీపర్‌), హార్ధిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చాహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌, వరుణ్‌ చక్రవర్తి, బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ ఉన్నారు. స్టాండ్‌ బై ప్లేయర్స్‌గా శ్రేయస్‌ అయ్యార్‌, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చహార్‌ ఎంపికైనారు.

చదవండి: T20 World Cup 2021: చాహల్‌ను అందుకే తీసుకోలేదు.. ఇక వరుణ్‌ విషయానికి వస్తే..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top