IPL 2022 Mega Auction: అత‌డు వేలంలోకి వ‌స్తే.. జట్లు పోటీ పడాల్సిందే: అశ్విన్‌

Ravi Ashwin backs India Hangargekar u19 star to bag huge money in IPL mega auction - Sakshi

అండ‌ర్‌-19 ప్ర‌పంచ‌క‌ప్‌లో భార‌త యువ ఆట‌గాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు. దీంతో రానున్న ఐపీఎల్‌-2022 మెగా వేలంలో యువ ఆట‌గాళ్ల కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డే అవ‌కాశం ఉంది. ఇక బెంగ‌ళూరు వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 12, 13 తేదీల్లో వేలం నిర్వ‌హించేందుకు బీసీసీఐ ఏర్పాట్లు చేస్తోంది. వేలం నేపథ్యంలో టీమిండియా స్టార్ స్పిన్న‌ర్  ర‌విచంద్ర‌న్ అశ్విన్ కీల‌క వాఖ్య‌లు చేశాడు. వేలంలో భార‌త‌ అండ‌ర్‌-19 పేస్ బౌల‌ర్ రాజ్వర్ధన్ హంగర్గేకర్ కోసం చాలా జ‌ట్లు పోటీప‌డ‌తాయి అని అశ్విన్ అభిప్రాయ‌ప‌డ్డాడు.

హంగర్గేకర్ ఇన్‌స్వింగర్స్‌ను బాగా బౌలింగ్ చేయగలడని అశ్విన్ కొనియాడాడు. "అత‌డు ఇన్‌స్వింగర్స్‌ను బాగా బౌలింగ్ చేయ‌గ‌ల‌డు. ప్రస్తుత భారత ఆర్మ్ పేసర్లలో ఇషాంత్ శ‌ర్మ‌కు మాత్ర‌మే ఉంది. ఇన్‌స్వింగర్స్ బ్యాట‌ర్‌ల‌ను ఇబ్బంది పెడ‌తాయి. కాబట్టి ఇన్‌స్వింగర్స్ బౌలింగ్ చేసే అత‌డికి వేలంలో క‌చ్చితంగా డిమాండ్ ఉంటుంద‌ని నేను భావిస్తున్నాను" అని యూట్యాబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు. కాగా హంగర్గేకర్ బ్యాట్‌తోను, బాల్‌తోను రాణించ‌గ‌ల‌డు. అండ‌ర్‌-19 ఆసియా క‌ప్‌ని భార‌త్ కైవ‌సం చేసుకోవ‌డంలో హంగర్గేకర్ కీల‌క‌పాత్ర పోషించాడు.

చ‌ద‌వండి: Rashid Khan: ర‌షీద్ ఖాన్ మంచి మ‌నసు.. యంగ్ బౌల‌ర్‌కి ఆర్థిక సాయం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top