Ranji Trophy: టీమిండియా యువ ఓపెనర్‌ విధ్వంసం.. క్వాడ్రపుల్‌ సెంచరీ మిస్‌! అయితేనేం.. దిగ్గజాల రికార్డులు బద్దలు

Ranji Trophy: Prithvi Shaw 379 Misses Out Quadruple 100 Breaks Records - Sakshi

Assam vs Mumbai- Prithvi Shaw Triple Century: రంజీ ట్రోఫీ టోర్నీలో టీమిండియా యువ ఓపెనర​ పృథ్వీ షా దుమ్ములేపుతున్నాడు. ఈ ముంబై ఆటగాడు అసోంతో మ్యాచ్‌లో ద్విశతకాన్ని ట్రిపుల్‌ సెంచరీగా మలిచాడు. గువహటి వేదికగా మంగళవారం మొదలైన టెస్టు తొలి రోజు ఆట ముగిసే సరికి ఈ యువ బ్యాటర్‌ 240 పరుగులు సాధించాడు.

క్వాడ్రపుల్‌ సెంచరీ మిస్‌
ఈ క్రమంలో బుధవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా త్రిశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే, 379 పరుగుల వద్ద రియాన్‌ పరాగ్‌ బౌలింగ్‌లో పృథ్వీ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో క్వాడ్రపుల్‌ సెంచరీ మిస్సయ్యాడు. కాగా ఈ తొలి ఇన్నింగ్స్‌లో మొత్తంగా 383 బంతులు ఎదుర్కొన్న 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో ఈ మేరకు భారీగా పరుగులు రాబట్టాడు.

దిగ్గజాల రికార్డులు బద్దలు
తద్వారా ట్రిపుల్‌ సెంచరీ వీరుడు 23 ఏళ్ల పృథ్వీ షా.. టీమిండియా దిగ్గజాల పేరిట ఉన్న పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ముంబై తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు చేసిన బ్యాటర్‌గా ఘనత సాధించాడు. గతంలో సంజయ్‌ మంజ్రేకర్‌ 377 పరుగులతో ముంబై టాప్‌ బ్యాటర్‌గా ఉండగా.. 32 ఏళ్ల తర్వాత యువ ఓపెనర్‌ పృథ్వీ షా అతడిని అధిగమించాడు.

అదే విధంగా.. టీమిండియా దిగ్గజం సునిల్‌ గావస్కర్‌ (ముంబై తరఫున రంజీల్లో 340 పరుగులు)ను కూడా దాటేశాడు. కాగా గత కొన్నాళ్లుగా భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న పృథ్వీ షా ఈ అద్భుత ఇన్నింగ్స్‌తో మరోసారి సెలక్టర్లకు సవాల్‌ విసిరాడు. 

చదవండి: Kohli-Pandya: పాండ్యాపై గుడ్లురిమిన కోహ్లి! సెంచరీ మిస్‌ అయ్యేవాడే! వీడియో వైరల్‌
IPL 2023: పంత్‌ లేని లోటు ఎవరూ తీర్చలేరు.. అయితే: గంగూలీ కీలక వ్యాఖ్యలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top