Ranji Trophy: చెలరేగిన ఆదిత్య.. 74 ఏళ్ల రికార్డ్‌ బ్రేక్‌ చేసిన విదర్భ! రంజీ చరిత్రలో తొలిసారి

Ranji Trophy: Aditya Shines Vidarbha Beat Gujarat Set New Record - Sakshi

Ranji Trophy 2022-23 - Vidarbha vs Gujarat: రంజీ చరిత్రలో విదర్భ సరికొత్త రికార్డు సృష్టించింది. తక్కువ స్కోరును డిఫెండ్‌ చేసుకుని ప్రత్యర్థిపై విజయం సాధించిన జట్టుగా ఘనత సాధించింది. రంజీ ట్రోఫీ టోర్నీ 2022-23 సీజన్‌లో భాగంగా ఎలైట్‌ గ్రూపు డిలో ఉన్న విదర్భ- గుజరాత్‌ మధ్య నాగ్‌పూర్‌ వేదికగా మంగళవారం టెస్టు మ్యాచ్‌ ఆరంభమైంది.

సొంతమైదానంలో జరిగిన మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన విదర్భ తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగులకే ఆలౌట్‌ అయి మొదటి రోజే చేదు అనుభవాన్ని మూటగట్టుకుంది. ఈ క్రమంలో గుజరాత్‌.. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. 

రెండో రోజు ఆటలో భాగంగా 256ల వద్ద మొదటి ఇన్నింగ్స్‌ ముగించి 182 పరుగుల ఆధిక్యం సంపాదించింది. ఇందుకు సమాధానంగా, విదర్భ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జితేశ్‌ శర్మ 69 పరుగులతో రాణించడం సహా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ అథర్వ టైడే 44, నచికేత్‌ బూటే 42 పరుగులతో పర్వాలేదనిపించారు. 

లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ ఆదిత్య విశ్వరూపం
దీంతో రెండో ఇన్నింగ్స్‌లో  254 పరగులు స్కోర్‌ చేయగలిగింది విదర్భ. ఈ క్రమంలో ఓవర్‌ నైట్‌ 6/1తో మూడో రోజు ఆట మొదలుపెట్టిన గుజరాత్‌ను విదర్భ బౌలర్‌ ఆదిత్య సర్వాటే కోలుకోలేని దెబ్బకొట్టాడు. మొత్తంగా 15.3 ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

ఆదిత్యకు తోడు హర్ష్‌ దూబే 3 వికెట్లతో రాణించడంతో రెండో ఇన్నింగ్స్‌లో 54 పరుగులకే గుజరాత్‌ కుప్పకూలింది. దీంతో 18 పరుగుల తేడాతో విదర్భ విజయం సాధించింది. గ్రూప్‌-డిలో పంజాబ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచింది.

బిహార్‌ పేరిట ఉన్న రికార్డు బద్దలు
ఈ క్రమంలో రంజీల్లో ఓ ఇన్నింగ్స్‌లో తక్కువ  స్కోరు చేసినప్పటికీ మ్యాచ్‌ను కాపాడుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.  ఇంతకు ముందు ఈ రికార్డు బిహార్‌ పేరిట ఉండేది. 1948- 49 సీజన్‌లో 78 పరుగులు మాత్రమే చేసిన బిహార్‌.. ఢిల్లీని 48 పరుగులకే ఆలౌట్‌ చేసింది. ఈ క్రమంలో 74 ఏళ్లుగా బిహార్‌ పేరిట ఉన్న రికార్డును విదర్భ తాజాగా బద్దలు కొట్టింది. ఇక ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో లార్డ్స్ ఓల్డ్‌ గ్రౌండ్‌లో 1794నాటి మ్యాచ్‌లో 41 పరుగులు చేసిన ఓల్డ్‌ఫీల్డ్‌.. ఎంసీసీని 34 పరుగులకు ఆలౌట్‌ చేసింది.

విదర్భ వర్సెస్‌ గుజరాత్‌ మ్యాచ్‌ స్కోర్లు
విదర్భ- 74 & 254
గుజరాత్‌- 256 & 54

చదవండి: Michael Bracewell: కుటుంబంలో అంతా క్రికెటర్లే! లేట్‌ అయినా సంచలనాలు సృష్టిస్తూ! కానీ ‘ఈరోజు’ నీది కాదంతే!
Hashim Amla Facts In Telugu: మచ్చలేని క్రికెటర్‌.. కోహ్లితో పోటీపడి పరుగులు

మరిన్ని వార్తలు :

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top