సూపర్‌ స్టోక్స్‌...

RAJASTHAN ROYALS BEAT MUMBAI INDIANS BY 8 WICKETS - Sakshi

60 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో  107 నాటౌట్‌

8 వికెట్లతో ముంబైపై రాజస్తాన్‌ గెలుపు

అబుదాబి: కీలక సమయంలో రాజస్తాన్‌ రాయల్స్‌ ఆటగాడు బెన్‌ స్టోక్స్‌ (60 బంతుల్లో 107 నాటౌట్‌; 14 ఫోర్లు 3 సిక్సర్లు) అద్భుత సెంచరీతో తన విలువ చాటుకున్నాడు. ఒత్తిడిని లెక్కచేయకుండా అద్భుత బ్యాటింగ్‌తో ముంబై ఇండియన్స్‌ బౌలింగ్‌ను తుత్తునీయలు చేశాడు. రాజస్తాన్‌ ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచాడు. దీంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ముంబై ఇండియన్స్‌పై 8 వికెట్లతో రాజస్తాన్‌ రాయల్స్‌ ఘనవిజయం సాధించింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై... హార్దిక్‌ పాండ్యా (21 బంతుల్లో 60 నాటౌట్‌; 2 ఫోర్లు, 7 సిక్సర్లు) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో 20 ఓవర్లలో 5 వికెట్లకు 195 పరుగులు చేసింది.

అతని ధాటికి ముంబై చివరి 5 ఓవర్లలో 79 పరుగుల్ని పిండుకుంది. సూర్యకుమార్‌ (40; 4 ఫోర్లు, 1 సిక్స్‌), సౌరభ్‌ తివారీ ( 34; 4 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నారు. ఆర్చర్, గోపాల్‌ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం 196 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్తాన్‌ మరో 10 బంతులు మిగిలి ఉండగానే 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ బెన్‌ స్టోక్స్‌ విజృంభణకు, సంజూ సామ్సన్‌ (31 బంతుల్లో 54 నాటౌట్‌; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) మెరుపులు జతకూడటంతో రాజస్తాన్‌ ఐదో విజయాన్ని అందుకుంది. ఈ ఇద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 82 బంతుల్లో 152 పరుగులు జోడించారు.  

సంక్షిప్త స్కోర్లు: ముంబై ఇండియన్స్‌: 195/5 (హార్దిక్‌ పాండ్యా 60 నాటౌట్, సూర్యకుమార్‌ 40; ఆర్చర్‌ 2/31, శ్రేయస్‌ గోపాల్‌ 2/30), రాజస్తాన్‌ రాయల్స్‌: 196/2 (స్టోక్స్‌ 107 నాటౌట్, సంజూ సామ్సన్‌ 54 నాటౌట్‌; ప్యాటిన్సన్‌ 2/40).  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top