విండీస్‌ను శాసించిన రబాడ.. తొలి టెస్టులో ఘన విజయం | Sakshi
Sakshi News home page

SA Vs WI: విండీస్‌ను శాసించిన రబాడ.. తొలి టెస్టులో ఘన విజయం

Published Thu, Mar 2 2023 10:12 PM

Rabada-Take-6 Wickets-South Africa Beat West Indies 87 Runs 1st Test - Sakshi

వెస్టిండీస్‌తో జరిగిన తొలి టెస్టులో సౌతాఫ్రికా శుభారంభం చేసింది. సెంచూరియన్‌ వేదికగా ముగిసిన తొలి టెస్టులో ప్రొటీస్‌ 87 పరుగుల తేడాతో విజయం అందుకుంది. 246 పరుగుల టార్గెట్‌తో నాలుగో ఇన్నింగ్స్‌ ఆరంభించిన వెస్టిండీస్‌ 41 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. జెర్మెన్‌ బ్లాక్‌వుడ్‌ 79 పరుగులతో ఒంటరిపోరాటం చేయగా మిగతావారు విఫలమయ్యారు. కగిసో రబాడ ఆరు వికెట్లతో విండీస్‌ నడ్డి విరవగా.. మార్కో జాన్సెన్‌ రెండు, నోర్ట్జే , కోట్జే చెరొక వికెట్‌ తీశారు.

అంతకముందు సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో 116 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 342 పరుగులకు ఆలౌట్‌ కాగా.. విండీస్‌ తొలి ఇ‍న్నింగ్స్‌లో 212 పరుగుల వద్ద ముగించడంతో సౌతాఫ్రికాకు 130 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం లభించినట్లయింది. ఇక తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో 47 పరుగులతో ఆకట్టుకున్న ఓపెనర్‌ మార్క్రమ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు మార్చి 8 నుంచి 12 వరకు జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరగనుంది.

చదవండి: టీమిండియా నిలబెట్టుకుంటే.. 141 ఏళ్ల రికార్డు బద్దలు!

'లక్ష్యం చిన్నదే.. రేపు ఏమైనా జరగొచ్చు!'

Advertisement
 

తప్పక చదవండి

Advertisement