సింధు 100 శాతం కృషి చేసింది: పీవీ రమణ

PV Ramana Response On Her Daughter PV Sindhu Performance - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఒలింపిక్స్‌​ సెమీస్‌లో పీవీ సింధు గెలుపు కోసం వంద శాతం కృషి చేసిందని సింధు తండ్రి పీవీ రమణ తెలిపారు. సింధు సెమీస్‌లో ఓటమి అనంతరం ఆయన స్పందించారు. అయితే సింధూ కంటే తైజూకు మెరుగైన రికార్డు ఉందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. పీవీ సింధు అటాకింగ్ గేమ్ ఆడలేకపోయిందని ఓటమికి కారణాలను వివరించారు. సింధు ప్రత్యర్థి తైజూయింగ్‌ వరల్డ్ ఛాంపియన్, ఆమె చాలా వ్యూహాత్మకంగా ఆడింది అని రమణ తెలిపారు.

కాగా, బ్యాడ్మింటన్‌ మహిళల సింగిల్స్‌ సెమీస్‌లో పీవీ సింధు- చైనీస్‌ తైపీకి చెందిన తైజుయింగ్‌ మధ్య పోరు నువ్వా- నేనా అన్నట్లుగా సాగింది. తొలి గేమ్‌లో ఆధిక్యం దిశగా దూసుకుపోయిన సింధును తైజు సమర్థవంతంగా ఎదుర్కొంది. అనంతరం దూకుడైన ఆటతో తొలి గేమ్‌లో 21-18తో పీవీ సింధును ఓడించింది. ఇక రెండో గేమ్‌లో  తైజుయింగ్‌కు సింధు గట్టి పోటీ ఇవ్వలేకపోయింది. రెండో గేమ్‌లో 12-21 తేడాతో  సింధు ఓటమిపాలైంది. సెమీస్‌లో ఓడిన సింధు ఇక​ కాంస్య పతక వేట కొనసాగించనుంది. హీ బింగ్‌ జియాతో సింధు గెలిస్తే కాంస్య పతకం ఖాయమవుతుంది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top