క్రికెట్ వెస్టిండీస్ ఆథ్వర్యంలో జరుగుతున్న వెస్టిండీస్ ఛాంపియన్‌షిప్‌లో భయానక ఘటన చోటు చేసుకుంది. సర్ వివియన్ స్టేడియం వేదికగా లీవార్డ్ ఐలాండ్స్–ట్రినిడాడ్ అండ్ టొబాగో జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పిచ్ ప్రమాదకరంగా మారడంలో మ్యాచ్‌ను మధ్యలోనే నిలిపివేశారు.
ట్రినిడాడ్ పేసర్ జేడన్ సీల్స్ వేసిన బంతి, లీవార్డ్ ఐలాండ్స్ బ్యాటర్ జెర్మియా లూయిస్ హెల్మెట్‌ను బలంగా తాకింది. అసమాన బౌన్స్ కారణంగా బంతి ఒక్కసారిగా తలపైకి దూసుకువచ్చి లూయిస్‌ను కిందపడేసింది. ఈ ఘటనతో మైదానంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
Jayden Seales has claimed the first seven wickets to fall in an innings for Trinidad & Tobago against Leeward Islands, but looks set to be denied the chance to take 10 with the game halted due to a dangerous pitch. The last ball before the suspension is not for the faint-hearted pic.twitter.com/o4G5ULiSAh
— Ben Gardner (@Ben_Wisden) April 21, 2026
లూయిస్ కొద్దిసేపటి తర్వాత లేచినప్పటికీ, తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ హెల్మెట్‌ను కాలితో తన్నడం, పిచ్‌ను కొట్టడం కనిపించింది. అనంతరం అతడిని స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి స్థిరంగా ఉన్నట్లు సమాచారం.
ఈ ఘటన తర్వాత మ్యాచ్ అధికారులతో పాటు అంపైర్లు చర్చలు జరిపి పిచ్ ప్రమాదకరంగా ఉందని తేల్చారు. ఆట కొనసాగితే ఆటగాళ్లకు గాయాలు తప్పవని తెలిసి మ్యాచ్‌ను డ్రాగా ప్రకటించారు.
మూడో రోజు వరకు పిచ్ అస్థిరంగా ఉండటం వల్ల ఇప్పటికే అనేక వికెట్లు పడిపోయాయి. బంతి ఎలా బౌన్స్ అవుతుందో అంచనా వేయడం బ్యాటర్లకు కష్టమైంది.
ఈ ఘటన క్రికెట్ ప్రపంచాన్ని కుదిపేసిన ఆస్ట్రేలియా ఆటగాడు ఫిల్ హ్యూస్ ఘటనను గుర్తు చేసింది. హ్యూస్ మెడకు బంతి తగిలి ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఇప్పటి ఘటనలో లూయిస్ సురక్షితంగా బయటపడటం ఊరట కలిగించినప్పటికీ, పిచ్ పరిస్థితులపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఈ ఘటన ఆటగాళ్ల భద్రత ఎంత ముఖ్యమో మరోసారి గుర్తుచేసింది. సాంకేతిక పరిజ్ఞానం, రక్షణ పరికరాలు మెరుగుపడినా పిచ్ నాణ్యతలో లోపాలు ఉంటే ప్రమాదాలు తప్పవని స్పష్టం చేసింది.


