PAK vs WI: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజాం.. ప్రపంచంలోనే తొలి ఆటగాడిగా..!

Pakistan Captain Babar Azam Achieves Huge Record With Half Century In 2nd ODI - Sakshi

పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ ఆజాం తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ముల్తాన్‌ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో 77 పరుగులు సాధించిన బాబర్‌.. పాక్‌ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్‌లో బాబర్ ఆజాం అరుదైన ఘనత సాధించాడు.

మూడు ఫార్మాట్‌లలో వరుసగా తొమ్మిది ఫిప్టీ ప్లస్‌ స్కోర్‌లను నమోదు చేసిన తొలి ఆటగాడిగా బాబర్‌ నిలిచాడు. ఇక ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్‌ 120 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో పాకిస్తాన్‌ కైవసం చేసుకుంది.
స్కోర్లు
పాకిస్తాన్‌: 275/8
వెస్టిండీస్‌: 155/10
ఫలితం: 120 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ ఘన విజయం

మూడు ఫార్మాట్లలో గత తొమ్మిది ఇన్నింగ్స్‌లలో  బాబర్ సాధించిన స్కోర్‌లు
196 వర్సెస్‌ ఆస్ట్రేలియా (2వ టెస్టు - మార్చి 12)
67, 55 వర్సెస్‌  ఆస్ట్రేలియా (3వ టెస్టు - మార్చి 21)
57 వర్సెస్‌ ఆస్ట్రేలియా (తొలి వన్డే - మార్చి 29)
114 వర్సెస్‌ ఆస్ట్రేలియా (రెండో వన్డే - మార్చి 31)
105( నాటౌట్) వర్సెస్‌ ఆస్ట్రేలియా(మూడో వన్డే-ఏప్రిల్ 2)
66 వర్సెస్ ఆస్ట్రేలియా(ఏకైక టీ20-ఏప్రిల్ 5 )
103 వర్సెస్ వెస్టిండీస్ (తొలి వన్డే - జూన్ 8)
77 vs వెస్టిండీస్ (రెండో వన్డే - జూన్ 10)
చదవండి: PAK vs WI: వెస్టిండీస్‌పై పాకిస్తాన్‌ ఘన విజయం.. సిరీస్‌ కైవసం..

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top