Sunil Chhetri: భారత ఆటగాళ్లు ఆటపైనే దృష్టి పెట్టాలని సూచించిన సునీల్ ఛెత్రి

FIFA Ban Threat To AIFF: భారత ఫుట్‌బాలర్లంతా ప్రపంచ ఫుట్‌బాల్ సమాఖ్య (ఫిఫా) హెచ్చరికల్ని పట్టించుకోకుండా ఆటపైనే దృష్టి పెట్టాలని స్టార్ స్ట్రయికర్ సునీల్ ఛెత్రి సూచించాడు. ఈ విషయంపై ఆటగాళ్లు అతిగా ఆలోచించాల్సిన అవసరం లేదని, ఇది మన చేతులు దాటిపోయిందని ఛెత్రి అన్నాడు. అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం (ఏఐఎఫ్‌ఎఫ్) చాన్నాళ్లుగా అడ్‌హక్ కమిటీతో నడుస్తోంది. పూర్తిస్థాయి కార్యవర్గం లేకపోవడంతో, సంబంధం లేని (థర్డ్ పార్టీ) వ్యక్తుల జోక్యంతో భారత ఫుట్‌బాల్ కార్యకలాపాలు జరగడం ఇష్టపడని ‘ఫిఫా’ ఇటీవల నిషేధం విధిస్తామని హెచ్చరించింది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు