అంతా బయటివాళ్లే... మనోళ్లు ఒక్కరు లేరు

No Player From India Makes Century In 100th Test - Sakshi

చెన్నై: టీమిండియాతో జరుగుతున్న తొలి టెస్టులో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. 100వ టెస్టులో సెంచరీ సాధించిన 9వ ఆటగాడిగా రూట్‌ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ఇంతకముందు ఈ ఘనత సాధించిన వారిలో జావెద్‌ మియాందాద్‌, రికీ పాంటింగ్‌, ఇంజమామ్‌ ఉల్‌ హక్‌, గోర్డన్‌ గ్రీనిడ్జ్‌, కొలిన్‌ కౌడ్రే, అలెక్‌ స్టీవార్ట్‌, గ్రేమి స్మిత్‌, హషీమ్‌ ఆమ్లా ఉన్నారు. అయితే 100వ టెస్టులో సెంచరీ చేసిన ఆటగాడు టీమిండియా నుంచి ఒక్కరు లేకపోవడం విశేషం.

కాగా ఈ ఘనత సాధించిన తొమ్మిది మందిలో రూట్‌ సహా మరో ఇద్దరు ఇంగ్లండ్‌కు చెందినవారు కాగా..పాకిస్తాన్‌, దక్షిణాఫ్రికా నుంచి ఇద్దరు ఉండగా.. ఆస్ట్రేలియా, విండీస్‌ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. దీంతో పాటు రూట్‌ 100వ టెస్టులో సెంచరీ సాధించిన 5వ కెప్టెన్‌గా రికార్డులకెక్కాడు. 2012లో దక్షిణాఫ్రికా కెప్టెన్‌ గ్రేమి స్మిత్‌ సెంచరీ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు రూట్‌ కెప్టెన్‌గా 100వ టెస్టులో సెంచరీ చేయడం విశేషం. స్మిత్‌, రూట్‌ కంటే ముందు కెప్టెన్‌ హోదాలో 100వ టెస్టులో సెంచరీ సాధించిన వారిలో మియాందాద్‌, ఇంజమామ్‌, కొలిన్‌ కౌడ్రే ఉన్నారు.
చదవండి: మ్యాచ్‌ మధ్యలో కోహ్లి, రూట్‌ ఏం మాట్లాడారో!
                  జో రూట్‌ అరుదైన ఘనత

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top