పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం..

No More Neutral Venues For Us Says PCB official - Sakshi

No More Neutral Venues For Us Says PCB: పాకిస్తాన్‌ క్రికెట్ బోర్డు (పీసీబీ) కీలక నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ అతిధ్యం ఇచ్చే హోమ్ సిరీస్‌లను తటస్థ వేదికలలో ఇప్పటినుంచి నిర్హహించబోమని ఆ దేశ క్రికెట్‌ బోర్డు సృష్టం చేసింది. అంతర్జాతీయ మ్యాచ్‌లు నిర్వహించడానికి తమ దేశం చాలా సురక్షితం అని పీసీబీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. 2005 తర్వాత  మొదటిసారి పాక్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ భద్రతా కారణాల దృష్ట్యా  ఒక్క మ్యాచ్‌ కూడా ఆడకుండా సీరిస్‌ రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే.

ఆదే విధంగా ఇంగ్లండ్‌ జట్టు కూడా న్యూజిలాండ్ బాటలోనే పయనించింది. పాక్‌తో సీరీస్‌ను రద్దు చేసుకున్నట్లు ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. కాగా 2009లో శ్రీలంక జట్టు బస్సుపై జరిగిన ఉగ్రదాడి తర్వాత అన్ని దేశాల క్రికెట్‌ జట్లు పాకిస్తాన్‌లో పర్యటించడనికి విముఖత చూపాయి. దీంతో పాక్‌తో జరగాల్సిన  సీరీస్‌లను తటస్థ వేదికగా యూఏఈలో పీసీబీ నిర్వహించేది.

చదవండిT20 World Cup 2021: శ్రీలంక క్రికెట్‌ బోర్డు కీలక నిర్ణయం

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top