హాఫ్‌ సెంచరీ తర్వాత రాణా ఇలా..

Nitish Dedicated His Half Century To His Father In Law - Sakshi

అబుదాబి: ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఓపెనర్‌ నితీష్‌ రాణా మెరిశాడు. 53 బంతుల్లో 13 ఫోర్లు 1 సిక్స్‌తో 81 పరుగులు సాధించి జట్టుకు భారీ స్కోరు అందించడంలో సాయపడ్డాడు.  35 బంతుల్లో హాఫ్‌ సెంచరీ మార్కును చేరిన తర్వాత దాన్ని తన మాయ్య సురీందర్‌ మార్వాకు అంకింత చేశాడు. నిన్న తన మావ సురిందర్‌ కన్నుమూయడంతో ఆ విషాదాన్ని కూడా దిగమింగుకుని బరిలోకి దిగాడు రాణా.  ఓపెనర్‌గా తన పాత్రకు న్యాయం చేయడంతో హాఫ్‌ సెంచరీ తర్వాత సురిందర్‌ మార్వా పేరు మీద ఉన్న జెర్సీని గ్రౌండ్‌లో ప్రదర్శించాడు. తన హాఫ్‌ సెంచరీని మావ సురిందర్‌కు అంకితం ఇస్తున్నట్లు, ఇదే తన అతని మృతికి ఘనమైన నివాళిగా తన చేతల ద్వారా రాణా తెలిపాడు.

ముందుగా బ్యాటింగ్‌ చేసిన కేకేఆర్‌ ఆరు వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. రాణాకు జతగా నరైన్‌(64; 32 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లు)  చెలరేగడంతో ఢిల్లీ భారీ స్కోరును బోర్డుపై ఉంచింది. ణాతో కలిసి 115 పరుగుల భాగస్వామ్యం జత చేసిన తర్వాత నరైన్‌ నాల్గో వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. చివర్లో  మోర్గాన్‌ 9 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో  17 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.(ఇన్నింగ్స్‌ తొలి బంతికే వికెట్‌ కోల్పోతే..)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top