
File Photo
విజయ్ హజారే ట్రోఫీలో తమిళనాడు బ్యాటర్ నారాయణ్ జగదీశన్ సెంచరీల మోత మోగిస్తున్నాడు. శనివారం హర్యానాతో జరిగిన మ్యాచ్‌లో జగదీశన్ అద్భుతమైన సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో 123 బంతులు ఎదుర్కొన్న జగదీశన్ 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 128 పరుగులు చేశాడు. కాగా ఈ టోర్నీలో ఇప్పటి వరకు జగదీశన్‌కు ఇది నాలుగో సెంచరీ.
తద్వారా జగదీశన్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. విజయ్ ట్రోఫీలో ఒకే ఎడిషన్‌లో నాలుగు సెంచరీలు చేసిన ఐదో ఆటగాడిగా జగదీశన్ నిలిచాడు. ఇక అరుదైన ఘనత సాధించిన జాబితాలో భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లితో పాటు రుతురాజ్ గైక్వాడ్, పృథ్వీ షా, దేవదత్ పడిక్కల్ ఉన్నారు. 2008-09 సీజన్‌లో ఢిల్లీ తరపున ఆడిన కోహ్లి నాలుగు సెంచరీలు సాధించాడు. అదే విధంగా లిస్ట్-ఏ క్రికెట్‌లో వరుసగా నాలుగు సెంచరీలు చేసిన మూడో ఆటగాడిగా కూడా నారాయణ్ నిలిచాడు.
చదవండి: ఓపెనర్‌గా పంత్ వద్దు.. అతడిని పంపండి! విధ్వంసం సృష్టిస్తాడు