Mohammad Rizwan: టి20 క్రికెట్‌లో పాక్‌ ఓపెనర్‌ కొత్త చరిత్ర.. ఒక్క ఏడాదిలోనే

Mohammad Rizwan First Batter Reach 2000 Runs T20Is Single Calendar Year - Sakshi

Mohammad Rizwan First Batter Reach 2000 Runs T20Is Single Calender Year.. పాకిస్తాన్‌ ఓపెనర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ టి20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ఒకే క్యాలండర్‌ ఇయర్‌లో టి20 క్రికెట్‌లో 2వేల పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా మహ్మద్‌ రిజ్వాన్‌ రికార్డులకెక్కాడు. కరాచీ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన చివరి టి20లో 45 బంతుల్లోనే 87 పరుగులు మెరుపు ఇన్నింగ్స్‌ ఆడిన రిజ్వాన్‌.. ఒక్క ఏడాదిలోనే అంతర్జాతీయ, ఇతర లీగ్‌లు కలిపి 2వేల పరుగులు సాధించాడు.

చదవండి: చంపేస్తానంటూ హెచ్చరిక.. ఆటగాడిపై జీవితకాల నిషేధం

అతనికి తోడుగా మరో ఓపెనర్‌ బాబర్‌ అజమ్‌ కూడా 79 పరుగులు చేయడంతో పాకిస్తాన్‌ 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేధించింది. అంతకముందు వెస్టిండీస్‌ 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (64), బ్రూక్స్‌ (49), బ్రెండన్‌ కింగ్‌ (43) చెలరేగారు.  స్టిండీస్‌తో జరిగిన మూడు టి20ల సిరీస్‌ను పాకిస్తాన్‌ 3–0తో సొంతం చేసుకుంది.

ఇక ఇరుజట్ల నుంచి ఆటగాళ్లు వరుసగా కరోనా బారిన పడుతుండడంతో విండీస్‌ పూర్తి జట్టును బరిలోకి దింపగలదా అనే అనుమానం కనిపించింది. అయితే ఏదో రకంగా చివరి టి20 ఆడే విధంగా విండీస్‌ను పాక్‌ బోర్డు ఒప్పించగలిగింది. అయితే శనివారంనుంచి జరగాల్సిన వన్డే సిరీస్‌ను ప్రస్తుతానికి రద్దు చేసి జూన్‌ 2022లో మళ్లీ జరిపేందుకు ఇరు బోర్డులు అంగీకరించాయి.    

చదవండి: పాక్‌ క్రికెట్‌కు కరోనా కాటు.. మరో సిరీస్ వాయిదా

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top