WTC Final 2021-23: డబ్ల్యూటీసీ ఫైనల్‌.. భరత్‌ వద్దు! ఆ స్థానంలో అతడే బెటర్‌: కైఫ్‌

Mohammad Kaif names his India XI for WTC final - Sakshi

భారత్‌-ఆస్ట్రేలియా మధ్య జరగనున్న వరల్డ్‌ టెస్టు ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌కు కౌంట్‌డౌన్‌ ప్రారంభమైంది. లండన్‌లోని ప్రఖ్యాత ఓవల్‌ మైదానంలో జూన్‌ 7న ఈ ఫైనల్‌ పోరు జరగనుంది. కాగా 2013 ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ విజేతగా నిలిచిన టీమిండియా.. అప్పటినుంచి ఒక్క ఐసీసీ టైటిల్‌ను కూడా సొంతం చేసుకోలేకపోయింది. దీంతో ఈ ఫైనల్‌ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను ఎలాగైనా ఓడించి.. 10 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని భారత జట్టు భావిస్తోంది. 

ఇక ఇది ఇలా ఉండగా.. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు టీమిండియా ప్లేయింగ్‌ ఎలెవన్‌కు సంబంధించి మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో భారత మాజీ భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ చేరాడు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ తుది జట్టులో వికెట్‌ కీపర్‌గా శ్రీకర్‌ భరత్‌ కంటే కిషన్‌కు అవకాశం ఇస్తే బాగుంటుందని కైఫ్‌ అబిప్రాయపడ్డాడు. ఆరోస్థానంలో బ్యాటింగ్‌ వచ్చి పంత్‌లా మెరుపులు మెరిపించే ఆటగాడు కావాలని కైఫ్‌ తెలిపాడు.

"డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఓపెనర్లుగా శుభ్‌మన్ గిల్, రోహిత్‌ శర్మ రావాలి. ఆ తర్వాతి స్థానంలో అనుభవం ఉన్న పుజారాను పంపాలి. ఇక మూడో స్థానంలో విరాట్ కోహ్లి, ఆ తర్వాత రహానే ఉండాలి. ఇక ఆరో స్థానంలో హిట్టింగ్‌ చేసే ఆటగాడు కావాలి. కాబట్టి నా వరకు అయితే భరత్‌ కంటే కిషన్‌ను అవకాశం ఇస్తే మంచిది. అతడు రిషబ్‌ పంత్‌ రోల్‌ను పోషిస్తాడు. అదే విధంగా ఏడో స్థానంలో నేను జడేజా అవకాశం ఇవ్వాలని అనుకుంటున్నాను.

ఎనిమిదో స్థానంలో పిచ్ పరిస్థితులను బట్టి అశ్విన్ లేదా శార్దూల్‌ ఠకూర్‌ని పంపాలి. ఇక పిచ్‌ స్పిన్‌కు అనుకూలిస్తే.. అశ్విన్‌  వార్నర్, ట్రావిస్ హెడ్ ఖవాజా వంటి లెఫ్ట్‌హ్యాండ్‌ బ్యాటర్లను ఈజీగా పెవిలియన్‌కు పంపుతాడు. ఫాస్ట్‌బౌలర్ల జాబితాలో  మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్‌ యాదవ్‌కు ఛాన్స్‌ ఇవ్వాలి అనుకుంటున్నాను. అయితే  పిచ్ పరిస్థితులను బట్టి తుది జట్టులో శార్దూల్‌ ఠకూర్‌ అవకాశం ఇవ్వాలని" స్టార్‌స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో  కైఫ్‌ పేర్కొన్నాడు. 
చదవండి: WTC Final 2021-23: ఎక్కడా మన వాళ్లు టాప్‌లో లేరు.. అయినా ఫైనల్‌కు..!

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top