ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌.. టాప్‌ ర్యాంక్‌లో మిథాలీ రాజ్‌

Mithali Raj At The Top Of ICC Women's ODI Rankings For batters - Sakshi

Mithali Raj: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్‌ టాప్‌ ర్యాంక్‌లో నిలిచింది. మిథాలి 762 పాయింట్లతో..దక్షిణాఫ్రికా ఓపెనర్‌ లిజెల్లీ లీ తో కలిసి ఉమ్మడిగా నెం1 స్థానంలో కొనసాగుతోంది.  వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో లీ అజేయంగా 91 పరగులు సాధించి  టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది.

ఆస్ట్రేలియాకు చెందిన అలిస్సా హీలీ మూడవ స్థానంలో ఉండగా, భారత ఓపెనర్ స్మృతి మంధాన తొమ్మిదో స్థానంలో నిలిచింది. బౌలర్లలో భారత పేసర్ జూలన్ గోస్వామి, సీనియర్ స్పిన్నర్ పూనమ్ యాదవ్  వరుసగా ఐదవ, తొమ్మిదవ స్థానంలో నిలిచారు. ఆల్ రౌండర్ల జాబితాలో దీప్తి శర్మ ఐదవ స్థానంలో కొనసాగుతోంది. . టీ 20  ర్యాంకింగ్స్‌లో భారత యువ సంచలనం షఫాలి వర్మ  టాప్ ర్యాంక్‌లో కొనసాగుతుంది.

చదవండి: T20 World Cup 2021: ‘ఆ రెండు జట్లే హాట్‌ ఫేవరేట్‌.. అయితే టీమిండియా కూడా’

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top