ఉప్పల్‌లో భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌.. హెచ్‌సీఏకు క్రీడామంత్రి స్ట్రాంగ్‌ వార్నింగ్‌

Minister Srinivas Goud serious warning to hca over Match Tickets Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌కు తెలంగాణ క్రీడా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ వార్నింగ్‌ ఇచ్చారు. భారత్‌- ఆస్ట్రేలియా మ్యాచ్‌ టికెట్స్‌ విషయంలో బ్లాక్‌ టికెట్స్‌పై సీరియస్‌ యాక్షన్‌ ఉంటుందని హెచ్చరించారు. టికెట్స్‌ ఎన్ని ఉన్నాయి? ఎన్ని సేల్‌ చేశారు? ఎవరికి ఎన్ని టికెట్స్‌ కేటాయిస్తున్నారో హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ వివరాలతో సహా చెప్పాలన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన భూమిలో స్టేడియం కట్టారన్నది గుర్తుంచుకోవాలన్నారు. పది మంది ఎంజాయ్‌ చేయడానికి, బ్లాక్‌ దందా కోసం మ్యాచ్‌ టికెట్స్‌ ఇవ్వలేదన్నారు. క్రికెట్‌ మ్యాచ్‌ టికెట్స్‌ విషయంలో తెలంగాణ రాష్ట్ర పరువు తీయొద్దన్నారు. హెచ్‌సీఏ మ్యాచ్‌కు సంబంధించి టికెట్స్‌ అన్నింటిని సేల్‌ చేయాలని ఆదేశించారు. బ్లాక్‌ దందా జరిగినట్లు తెలిస్తే విచారణ చేపట్టి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సెప్టెంబరు 25న(ఆదివారం) ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ ఇంటర్నేషనల్‌ స్టేడియంలో భారత్‌- ఆసీస్‌ మధ్య మూడో టీ20 జరుగనున్న విషయం తెలిసిందే.

చదవండి: (స్వపక్షంలో విపక్షం.. గులాబీ పార్టీలో రచ్చకెక్కిన వర్గ విభేదాలు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top