Australian Open 2022: అంపైర్‌ను బూతులు తిట్టిన ఆటగాడికి జరిమానా

Medvedev Fined 12000 USD For Outburst At Umpire In Australian Open 2022 Semi Final - Sakshi

Medvedev Fined 12000 USD: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ 2022 సెమీఫైనల్‌ మ్యాచ్‌ సందర్భంగా చైర్‌ అంపైర్‌ను బూతులు తిట్టిన ప్రపంచ నెంబర్‌ 2 ఆటగాడు డానిల్‌ మెద్వెదెవ్‌(రష్యా)కు భారీ జరిమానా విధించారు టోర్నీ నిర్వాహకులు. క్రీడా స్పూర్తికి విరుద్ధంగా అంపైర్‌పై అనవసరంగా నోరు పారేసుకున్నాడన్నకారణంగా మెద్వెదెవ్‌కు 12000 యూఎస్‌ డాలర్లు ఫైన్‌ వేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. 

కీలకమైన సెమీస్‌ సందర్భంగా ప్రత్యర్థి ఆటగాడు సిట్సిపాస్ రూల్స్‌కు విరుద్ధంగా స్టాండ్స్‌లోని తన తండ్రి నుంచి సలహాలు తీసుకున్నాడని ఆరోపిస్తూ.. చైర్‌ అంపైర్‌ జౌమ్ క్యాంపిస్టల్‌ను స్టుపిడ్‌ అంటూ దూషించాడు మెద్వెదెవ్‌. అయితే, మ్యాచ్‌ అనంతరం మెద్వెదెవ్‌ తన ప్రవర్తనపై అంపైర్‌ను క్షమాపణ కోరినప్పటికీ నిర్వాహకులు చర్యలు తీసుకున్నారు. కాగా, సెమీస్‌లో నాలుగో సీడ్‌ సిట్సిపాస్‌ను 7-6(5),4-6,6-4,6-1తో కంగుతినిపించిన మెద్వెదెవ్‌.. ఆదివారం జరగబోయే ఫైనల్లో స్పెయిన్‌ బుల్‌ రఫేల్‌ నదాల్‌తో అమీతుమీకి సిద్ధమయ్యాడు. 
చదవండి: రెండు నెలల క్రితం రిటైర్మెంట్‌ ఆలోచన.. కట్‌చేస్తే

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top