Ind Vs Sl 2nd Test: అప్పుడు సెహ్వాగ్ .. ఇప్పుడు మయాంక్‌ అగర్వాల్.. తొమ్మిదేళ్ల తర్వాత!

Mayank Agarwal gets run out in dramatic fashion in Bengaluru Test - Sakshi

బెంగళూరు వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న రెండో టెస్టులో టీమిండియా అనూహ్యంగా తొలి వికెట్‌ను కోల్పోయింది. అవసరం లేని పరుగుకు ప్రయత్నించి మయాంక్‌ అగర్వాల్ రనౌట్‌ అయ్యాడు. అయితే మయాంక్‌ ఔటైన బంతి రీప్లేలో నోబాల్‌గా తేలడం గమనార్హం. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్‌ వేసిన విశ్వ ఫెర్నాండో బౌలింగ్‌లో మూడో బంతి అగర్వాల్ ఫ్రంట్ ప్యాడ్‌కు తగిలింది. దీంతో శ్రీలంక ఫీల్డర్లు  ఎల్బీడబ్ల్యూకు అప్పీల్‌ చేశారు. అయితే అంపైర్‌ వారి అప్పీల్‌ను తిరష్కరించాడు. అయినప్పటికీ, మయాంక్ తొందరపడి అవసరం లేని పరుగుకు ప్రయత్నించాడు.

అయితే నాన్‌ స్ట్రైక్‌లో ఉన్న రోహిత్‌ "నో" అని చెప్పినప్పటకీ మయాంక్‌ వినిపించుకోలేదు. ఈ క్రమంలో శ్రీలంక ఫీల్డర్‌  ప్రవీణ్ జయవిక్రమ బంతిని వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు అందజేశాడు. దీంతో మయాంక్‌ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ధీంతో హోం గ్రౌండ్‌లో మయాంక్‌ అగర్వాల్‌కు నిరాశే ఎదురైంది.  ఇక 2012 తర్వాత టెస్ట్‌ల్లో భారత్‌ తొలి వికెట్‌ను రనౌట్‌ రూపంలో కోల్పోవడం ఇదే తొలి సారి. 2012 లో కోల్‌కతా వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వీరేంద్ర సెహ్వాగ్ రనౌట్‌ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. 

చదవండి: Ind Vs Sl 2nd Test: సిరాజ్‌కు నో ఛాన్స్‌.. తుది జట్టులోకి అక్షర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top