
Courtesy: IPL Twitter
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్ మాథ్యూ హేడెన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఐపీఎల్-2022లో రాహుల్ త్రిపాఠి అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటి వరకు ఈ ఏడాది సీజన్‌లో మూడు అర్ధసెంచరీలు సాధించాడు. ఇక మంగళవారం (మే 17) ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో త్రిపాఠి సునామీ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 44 బంతుల్లో 76 పరుగులు చేశాడు. ఈ క్రమంలో త్వరలోనే భారత జట్టు తరపున త్రిపాఠి అరంగేట్రం చేస్తాడని హేడెన్ అభిప్రాయపడ్డాడు. కాగా త్వరలో దక్షిణాఫ్రికాతో జరగనున్న టీ20 సిరీస్‌కు త్రిపాఠి ఎంపికయ్యే అవకాశం ఉంది.
"రాహుల్ త్రిపాఠి అద్భుతంగా ఆడుతున్నాడు. అతడు ధాటిగా బ్యాటింగ్ చేసే విధానం నన్ను ఎంత గానే ఆకట్టుకుంది. అతడు విధ్వంసకర ఆటగాడు. బంతిని మైదానంలో అన్ని వైపులా కొట్టగలడు. ముఖ్యంగా షార్ట్ పిచ్ బౌలింగ్‌కు త్రిపాఠి అద్భుతంగా ఆడగలడు. అతడు త్వరలో భారత జట్టులోకి వస్తాడని నేను అశిస్తున్నాను. ఆస్ట్రేలియా వంటి బౌన్సీ పిచ్‌లపై ఆడే సత్తా త్రిపాఠికి ఉంది" అని హేడెన్ పేర్కొన్నాడు.