
Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో మిల్లర్ వికెట్ తీయడం ద్వారా మార్కస్ స్టోయినిస్ టి20ల్లో వంద వికెట్లు పూర్తి చేసుకున్నాడు. 225 టి20 మ్యాచ్‌ల్లో స్టోయినిస్ ఈ ఘనత సాధించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన స్టోయినిస్.. ఓవర్ ఆఖరి బంతికి మిల్లర్ భారీ షాట్‌కు యత్నించి దీపక్ హుడాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
అంతకముందు గుజరాత్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా వికెట్‌ను ఖాతాలో వేసుకున్న స్టోయినిస్ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు. ఇక స్టోయినిస్ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. 60 వన్డేల్లో 1326 పరుగులతో పాటు 40 వికెట్లు, 51 టి20ల్లో 803 పరుగులతో పాటు 18 వికెట్లు తీశాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న గుజరాత్ టైటాన్స్ అంచనా తప్పయింది. ప్లాట్‌గా ఉన్న పిచ్‌పై పరుగులు రావడం కష్టమైంది. నిర్ణీత 20 ఓవర్లలో గుజరాత్ టైటాన్స్ ఆరు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. హార్దిక్ పాండ్యా 66, సాహా 47 పరుగులు చేశాడు.