డికాక్‌ విధ్వంసం.. ఉత్కంఠ పోరులో లక్నోదే విజయం

Lucknow Super Giants Beat Kolkata Knight Riders - Sakshi

ప్లే ఆఫ్స్‌కు సూపర్‌ జెయింట్స్‌ అర్హత

2 పరుగులతో కోల్‌కతాపై విజయం

డికాక్‌ మెరుపు సెంచరీ

ముంబై: ఐపీఎల్‌ చరిత్రలో అత్యుత్తమ ఓపెనింగ్‌ భాగస్వామ్యం... ఐపీఎల్‌ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లూ ఆడిన జోడీ... ఐపీఎల్‌ చరిత్రలో మూడో అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు... ఈ ఘనతలన్నీ ఒక్క మ్యాచ్‌లోనే వచ్చాయి. విధ్వంసకర బ్యాటింగ్‌తో క్వింటన్‌ డికాక్‌ రికార్డులు కొల్లగొట్టగా, కేఎల్‌ రాహుల్‌ సహాయక పాత్రలో నిలిచాడు. వీరిద్దరి జోరుతో 2022 సీజన్‌లో కొత్త జట్టు లక్నో సూపర్‌ జెయింట్స్‌ సగర్వంగా ‘ప్లే ఆఫ్స్‌’లోకి అడుగు పెట్టింది. ఆసక్తికరంగా సాగిన ఈ పోరులో లక్నో 2 పరుగులతో కేకేఆర్‌పై విజయం సాధించింది.

ముందుగా లక్నో 20 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ డికాక్‌ (70 బంతుల్లో 140 నాటౌట్‌; 10 ఫోర్లు, 10 సిక్స్‌లు) అజేయ సెంచరీకి రాహుల్‌ (51 బంతుల్లో 68; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీ తోడైంది. అనంతరం కోల్‌కతా 20 ఓవర్లలో 8 వికెట్లకు 208 పరుగులు చేసింది. శ్రేయస్‌ అయ్యర్‌ (29 బంతుల్లో 50; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), నితీశ్‌ రాణా (22 బంతుల్లో 42; 9 ఫోర్లు), రింకూ సింగ్‌ (15 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు), స్యామ్‌ బిల్లింగ్స్‌ (24 బంతుల్లో 36; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు.  

అభేద్య భాగస్వామ్యం...
డికాక్, రాహుల్‌ భాగస్వామ్యం సాధారణంగానే ప్రారంభమైంది. ఇద్దరూ కొన్ని చక్కటి షాట్లతో ఆకట్టుకున్నా... లక్నో అసలు ఆట చివరి 5 ఓవర్లలో కనిపించింది. 15 ఓవర్లు ముగిసేసరికి టీమ్‌ స్కోరు 122 పరుగులు కాగా, తర్వాతి 5 ఓవర్లలో ఏకంగా 88 పరుగులు వచ్చాయి! ఇందులో చాలా వరకు రాహుల్‌ ప్రేక్షక పాత్రకు (16 పరుగులు) పరిమితం కాగా... డికాక్‌ (71 పరుగులు) రెచ్చిపోయాడు. 59 బంతుల్లోనే డికాక్‌ శతకం పూర్తయింది. డికాక్‌కు ఐపీఎల్‌లో ఇది రెండో సెంచరీ. ఆ తర్వాత సౌతీ వేసిన ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌ లక్నో బ్యాటింగ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఈ ఓవర్లో రాహుల్‌ ఒక సిక్స్‌ కొట్టగా, డికాక్‌ వరుసగా మూడు బంతుల్లో 6, 6, 6తో చెలరేగాడు. రసెల్‌ వేసిన ఆఖరి ఓవర్లో డికాక్‌ వరుస బంతుల్లో 4, 4, 4, 4 కొట్టడం విశేషం.  

చివరి వరకు పోరాడినా...
మొహసిన్‌ తన వరుస ఓవర్లలో వెంకటేశ్‌ (0), తోమర్‌ (4)లను అవుట్‌ చేయడంతో కోల్‌కతా ఛేదన పేలవంగా మొదలైంది. చివర్లో రింకూ, నరైన్‌ 19 బంతుల్లోనే 58 పరుగులు జోడించి జట్టు గెలుపు అవకాశాలు పెంచారు. స్టొయినిస్‌ వేసిన ఆఖరి ఓవర్లో విజయం కోసం 21 పరుగులు చేయాల్సి ఉండగా రింకూ సింగ్‌ వరుసగా 4, 6, 6, 2తో గెలుపునకు చేరువగా తెచ్చాడు. 2 బంతుల్లో 3 పరుగులు సాధించాల్సిన స్థితిలో ఐదో బంతికి లూయిస్‌ అద్భుత క్యాచ్‌తో రింకూ ఆట ముగియగా, చివరి బంతికి ఉమేశ్‌ బౌల్డయ్యాడు.  

స్కోరు వివరాలు
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: డికాక్‌ (నాటౌట్‌) 140; రాహుల్‌ (నాటౌట్‌) 68; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (20 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా) 210.
బౌలింగ్‌: ఉమేశ్‌ 4–0–34–0, సౌతీ 4–0–57–0, నరైన్‌ 4–0–27–0, వరుణ్‌ 4–0– 38–0, రసెల్‌ 3–0–45–0, రాణా 1–0–9–0.  

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: వెంకటేశ్‌ (సి) డికాక్‌ (బి) మొహసిన్‌ 0; అభిజిత్‌ తోమర్‌ (సి) రాహుల్‌ (బి) మొహసిన్‌ 4; రాణా (సి) స్టొయినిస్‌ (బి) గౌతమ్‌ 42; శ్రేయస్‌ (సి) హుడా (బి) స్టొయినిస్‌ 50; బిల్లింగ్స్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) బిష్ణోయ్‌ 36; రసెల్‌ (సి) హుడా (బి) మొహసిన్‌ 5; రింకూ (సి) లూయీస్‌ (బి) స్టొయినిస్‌ 40; నరైన్‌ (నాటౌట్‌) 21; ఉమేశ్‌ (బి) స్టొయినిస్‌ 0; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 208.
వికెట్ల పతనం: 1–0, 2–9, 3–65, 4–131, 5–142, 6–150, 7–208, 8–208.
బౌలింగ్‌: మొహసిన్‌ 4–0– 20–3, హోల్డర్‌ 4–0–45–0, అవేశ్‌ 4–0–60–0, గౌతమ్‌ 2–0–23–1, బిష్ణోయ్‌ 4–0–34–1, స్టొయినిస్‌ 2–0–23–3.
 
ఆ క్యాచ్‌ పట్టి ఉంటే...
డికాక్‌ వ్యక్తిగత స్కోరు 12 పరుగుల వద్ద అతను కొట్టిన షాట్‌ థర్డ్‌మాన్‌ దిశగా వెళ్లగా, తొలి ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడుతున్న అభిజిత్‌ తోమర్‌ ఒత్తిడిలో బంతి గమనాన్ని సరిగా అంచనా వేయలేక క్యాచ్‌ వదిలేశాడు.

ఐపీఎల్‌లో నేడు
గుజరాత్‌ టైటాన్స్‌ X బెంగళూరు
రాత్రి గం. 7:30 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

18-05-2022
May 18, 2022, 22:36 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ సెంచరీతో చెలరేగాడు. కేవలం 70...
18-05-2022
May 18, 2022, 21:48 IST
లక్నో సూపర్‌ జెయింట్స్‌ ఓపెనర్లు క్వింటన్‌ డికాక్‌, కేఎల్‌ రాహుల్‌ సరికొత్త చరిత్ర సృష్టించారు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక భాగస్వా‍మ్యం...
18-05-2022
18-05-2022
May 18, 2022, 18:15 IST
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఆటగాడు రాహుల్ త్రిపాఠిపై ఆస్ట్రేలియా మాజీ ఓపెనర్‌ మాథ్యూ హేడెన్ ప్రశంసలు వర్షం కురిపించాడు. ఐపీఎల్‌-2022లో రాహుల్‌...
18-05-2022
May 18, 2022, 16:51 IST
IPL 2022 SRH vs MI: Bhuvneshwar Kumar Comments: ‘‘డెత్‌ ఓవర్లలో బౌలింగ్‌ చేసేటపుడు కూల్‌గా ఉండాలి. అలాంటి...
18-05-2022
May 18, 2022, 12:42 IST
ముంబై ఇండియన్స్‌పై గెలుపుతో ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఊహించని షాక్‌ తగిలింది. ఆ జట్టు...
18-05-2022
May 18, 2022, 11:59 IST
15 ఏళ్ల ఐపీఎల్‌ చరిత్రలో ముంబై ఇండియన్స్‌ తొలిసారి ఓ ఘోర అనుభవాన్ని ఎదుర్కొంది. నిన్న సన్‌రైజర్స్‌ చేతిలో పరాజయంతో...
18-05-2022
May 18, 2022, 11:53 IST
IPL 2022 MI vs SRH- Jasprit Bumrah Record: టీమిండియా స్టార్‌ బౌలర్‌, ముంబై ఇండియన్స్‌ ఆటగాడు జస్‌ప్రీత్‌...
18-05-2022
May 18, 2022, 11:15 IST
రాహుల్‌ త్రిపాఠిపై ఆకాశ్‌ చోప్రా ప్రశంసల జల్లు
18-05-2022
May 18, 2022, 11:15 IST
ముంబై ఇండియన్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్ 3 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 194 పరుగల...
18-05-2022
May 18, 2022, 09:59 IST
ముంబై ఇండియన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. నరాలు...
18-05-2022
May 18, 2022, 09:27 IST
టీమిండియా స్టార్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ వెండితెరపై మెరువనున్నాడా అంటే.. అవుననే సమాధానమే వినబడుతుంది. సరదా కోసం టిక్‌ టాక్...
18-05-2022
May 18, 2022, 07:15 IST
ముంబై: ఓడితే ఐపీఎల్‌లో ‘ప్లే ఆఫ్స్‌’ అవకాశాలు కోల్పోయే స్థితిలో బరిలోకి దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు సత్తా చాటింది....
17-05-2022
May 17, 2022, 22:36 IST
ఐపీఎల్‌ 2022 సీజన్‌లో ఆణిముత్యాల్లాంటి క్రికెటర్లు కొందరు లభించారు. తిలక్‌ వర్మ, ఆయుష్‌ బదోని, రింకూ సింగ్‌, శశాంక్‌ సింగ్‌...
17-05-2022
May 17, 2022, 20:14 IST
ఆర్‌సీబీ ఆల్‌రౌండర్‌ గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌ చేసిన ఒక పని సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సమ్మర్ సీజన్‌ అంటే ఎండలు...
17-05-2022
17-05-2022
May 17, 2022, 18:42 IST
ఆర్‌సీబీ మాజీ క్రికెటర్లు ఏబీ డివిలియర్స్‌,  క్రిస్‌ గేల్‌ను ఆ జట్టు యాజమాన్యం అరుదైన గౌరవంతో సత్కరించింది. ఆ జట్టు...
17-05-2022
May 17, 2022, 18:36 IST
తిలక్‌ వర్మపై టీమిండియా దిగ్గజం వ్యాఖ్యలు.. కానీ, ఇలా చేస్తేనే అంటూ సలహాలు!
17-05-2022
May 17, 2022, 17:23 IST
IPL 2022 Playoffs: కచ్చితంగా మనం ప్లే ఆఫ్స్‌నకు వెళ్తాం... కోల్‌కతాలో..
17-05-2022
May 17, 2022, 15:37 IST
ఐపీఎల్‌-2022లో భాగంగా మంగళవారం పంజాబ్‌ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ కెప్టెన్‌ రిషబ్‌ పంత్‌ ఔటైన తీరుపై టీమిండియా... 

Read also in:
Back to Top