IPL 2023: మా విజయానికి సీక్రెట్‌ అదే.. కృనాల్‌ సూపర్‌! చాలా తెలివిగా

LSG captain KL Rahul on Lucknow pitch after win against SRH - Sakshi

ఐపీఎల్‌-2023లో లక్నో సూపర్‌ జెయింట్స్‌తో రెండో విజయం నమోదు చేసింది. వాజ్‌పేయి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో  5 వికెట్ల తేడాతో లక్నో గెలుపొందింది. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో ఆగ్ర స్థానంలో నిలిచింది. ఇక ఈ ఘనవిజయంపై మ్యాచ్‌ అనంతరం లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ స్పందించాడు. 

ఈ అద్భుత విజయానికి కారణం తమ జట్టు స్పిన్నర్లే అని రాహుల్‌ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో లక్నో స్పిన్నర్లు అద్భుతంగా రాణించారు. కృనాల్‌ పాండ్యా మూడు వికెట్లతో ఎస్‌ఆర్‌హెచ్‌ టాప్‌ఆర్డర్‌ను దెబ్బతీయగా.. మిశ్రా రెండు, రవి బిష్ణోయ్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. రాహుల్‌ కీలక సమయాల్లో స్పిన్నర్లను ఊపయోగించి ఎస్‌ఆర్‌హెచ్‌ను ఏ దశలోను కోలుకోకుండా చేశాడు. ఇక పోస్ట్‌ మ్యాచ్‌ ప్రేజేంటేషన్‌లో రాహుల్‌ మాట్లాడుతూ.. "లక్నో వికెట్‌ పరిస్థితి ఎలా ఉందో మాకు ఒక రోజు ముందే మాకు అర్ధమైంది. గత రెండు వారాలగా మేము ఇక్కడే ఉన్నాం. 

కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో మాకు బాగా తెలుసు. ఒక వేళ నేను టాస్‌ గెలిచి ఉన్నా తొలుత బౌలింగే ఎంచుకునేవాడిని. ఇక్కడ ఇలా ఆడాలో నాకంటూ కొన్ని ప్లాన్స్‌ ఉన్నాయి. మొదటి రెండు ఓవర్లలో పేసర్లకు బంతి అద్భుతంగా టర్న్‌ అవ్వడం గమనించాను. జయదేవ్‌ ఉనద్కట్‌ వేసిన కొన్ని బంతులు అనూహ్యంగా టర్న్‌ అయ్యాయి.

అటువంటి సమయంలో స్పిన్నర్లను తీసుకువస్తే బంతి మరింత టర్న్‌ అవుతుంది అని భావించాను. అందుకే కృనాల్‌ చేతికి బంతికి ఇచ్చాను. అతడు అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ఇక లక్నో వంటి వికెట్‌పై చాలా తెలివగా బ్యాటింగ్‌ చేయాలి. మేము ఈ మ్యాచ్‌లో ఒక యూనిట్‌గా అదే చేసి చూపించాం. రాబోయే మ్యాచ్‌ల్లో ఇదే రిపీట్‌ చేస్తాము" అని అతడు పేర్కొన్నాడు.
చదవండి: Harry Brook: రూ. 13 కోట్లు పెట్టారు కదా! ఇలాగే ఉంటది.. కానీ పాపం: టీమిండియా మాజీ క్రికెటర్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top