ENG vs PAK: తొలి టీ20లో పాక్‌ విజయం.. లియామ్‌ సెంచరీ వృథా

Liam Livingstone Fastest Century Could Not Saved England In T20 With Pak - Sakshi

భారీ ఛేజ్‌లో భాగంగా జట్టు తడబాటు.. నిలదొక్కుకునే క్రమంలో 42 బంతుల్లో తొమ్మిది సిక్స్‌లతో విధ్వంసం సృష్టించాడు లియామ్‌ లివింగ్‌స్టోన్‌. అయినప్పటికీ ఇంగ్లండ్‌కు ఓటమి తప్పలేదు. పాకిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్‌ తొలి మ్యాచ్‌లో 31 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌ ఓడింది. దీంతో 3-0 వన్డే సిరీస్‌ అవమానకరైమన ఓటమికి కొంతలో కొంత పాక్‌ ప్రతీకారం తీర్చుకున్నట్లు అయ్యింది. 

శుక్రవారం నాటింగ్‌హమ్‌ ట్రెంట్‌ బ్రిడ్జ్‌లో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో పాక్‌, ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాక్‌.. కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ 49 బంతుల్లో 85 పరుగులు, రిజ్వాన్‌ 41 బంతుల్లో 63 పరుగులతో రాణించడంతో ఆరు వికెట్ల నష్టానికి 232 పరుగుల భారీ లక్క్క్ష్యాన్ని ఇంగ్లండ్‌ ముందు ఉంచింది. 

బ్యాట్‌​జులిపించిన లిమాయ్‌
అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. ఏడు ఓవర్లకే నాలుగు వికెట్లు పోగొట్టుకుని మ్యాచ్‌పై ఆశలు వదిలేసుకుంది. అయితే మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌ లియామ్‌ లివింగ్‌స్టోన్‌ విధ్వంసకర బ్యాటింగ్‌తో ఒక్కసారిగా ఆశలు చిగురించాయి. 42 బంతుల్లో శతకం బాదడంతో పాటు.. సిక్స్‌ ద్వారా టీ20ల్లో ఫాసెస్ట్‌ సెంచరీ సాధించిన ఇంగ్లీష్‌ బ్యాట్స్‌మన్‌ ఘనతకు తన ఖాతాలో వేసుకున్నాడు లియామ్‌.

కానీ, ఆ తర్వాతి బంతికే(17వ ఓవర్‌లో) భారీ షాట్‌​ప్రయత్నించి అవుట్‌ అయ్యాడు. తర్వాతి బ్యాట్స్‌మ్యాన్‌ చేతులెత్తేయడంతో మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే 201 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది ఇంగ్లండ్‌. వీరోచితంగా పోరాడిన లియామ్‌ను ఇంగ్లండ్‌ మాజీ దిగ్గజాలతో పాటు పలువురు మెచ్చుకుంటున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top