The Hundred League: లివింగ్‌స్టోన్‌ ఊచకోత.. 10 సిక్సర్లు, 3 ఫోర్లతో 92 నాటౌట్‌

Liam Livingstone 92 Not Out Powers Birmingham Phoenix To Hundred Final - Sakshi

లండన్‌: ద హండ్రెడ్‌ లీగ్‌లో భాగంగా నార్తర్న్ సూపర్‌ ఛార్జర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బర్మింగ్‌హామ్ ఫీనిక్స్ కెప్టెన్‌, ఇంగ్లండ్‌ స్టార్‌ ఆటగాడు లియామ్‌ లివింగ్‌స్టోన్ పెను విధ్వంసం సృష్టించాడు. 40 బంతుల్లో 10 భారీ సిక్సర్లు, 3 ఫోర్ల సాయంతో 92 పరుగులు సాధించి తన జట్టును ఫైనల్‌కు చేర్చాడు. ఈ క్రమంలో అతను ప్రత్యర్ధి బౌలర్లను ఊచకోత కోశాడు. అంతకుముందు బంతితోనూ(20 బంతుల్లో 3/25) దుమ్ముదులిపిన ఈ ఇంగ్లీష్‌ ఆల్‌రౌండర్‌.. ఒంటిచేత్తో తన జట్టును గెలిపించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సూపర్‌ ఛార్జర్స్ జట్టుకు ఓపెనర్లు క్రిస్ లిన్(25 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్సర్లు), టామ్ కోహ్లర్(44 బంతుల్లో 71; 4 ఫోర్లు, 5 సిక్సర్లు) శుభారంభాన్ని అందించారు. వీరు మినహా జట్టు సభ్యులంతా విఫలం కావడంతో సూపర్ ఛార్జర్స్ జట్టు నిర్ణీత 100 బంతుల్లో 8 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది.

అనంతరం 144 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో ఫీనిక్స్ జట్టుకు ఆదిలోనే షాక్‌ తగిలింది. ఓపెనర్ విల్ స్మీడ్ ఖాతా తెరవకుండానే అవుటయ్యాడు. అయితే అప్పుడే క్రీజులోకి వచ్చిన కెప్టెన్ లివింగ్‌స్టోన్ వచ్చీ రాగానే బౌలర్లపై విరుచుకుపడుతూ సిక్సర్ల వర్షం కురిపించాడు. అతనికి న్యూజిలాండ్ యువ ఓపెనర్ ఫిన్ అలెన్‌(26 బంతుల్లో 42; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) తోడయ్యాడు. వీరిద్దరూ కలిసి 51 బంతుల్లో 106 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడంతో ఫీనిక్స్ జట్టు కేవలం 74 బంతుల్లోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుని గ్రాండ్‌గా ఫైనల్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక, మరో సెమీఫైనల్ మ్యాచ్ ఆగష్టు 19న(గురువారం) సదరన్ బ్రేవ్స్, ట్రెంట్ రాకెట్స్ మధ్య జరగనుంది.
చదవండి: టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన సిరాజ్‌, కేఎల్‌ రాహుల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top