Jos Buttler: పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌.. ఇంగ్లండ్‌కు భారీ షాక్‌!

Jos Buttler to miss Pakistan T20Is due to injury - Sakshi

పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఇంగ్లండ్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆ జట్టు కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ గాయం కారణంగా పాకిస్తాన్‌తో మొత్తం సిరీస్‌కు దూరం కానున్నట్లు తెలుస్తోంది. పాక్‌ పర్యటనలో భాగంగా ఇంగ్లండ్‌ 7టీ20ల సిరీస్‌ ఆడనుంది. కాగా 17 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై ఇంగ్లీష్‌ జట్టు అడుగుపెట్టింది. కాగా గత కొంత కాలం నుంచి  బట్లర్‌ కాలి కండరాల నొప్పితో బాధపడుతున్నాడు.

ఈ గాయం కారణంగానే ది హాండ్రిడ్‌ లీగ్‌ మధ్య నంచి తప్పుకున్నాడు. అయితే అతడు ఇంకా పూర్తి ఫిట్‌నెస్‌ సాధించనట్లు తెలుస్తోంది. అదే విధం‍గా టీ20 ప్రపంచకప్‌కు ముందు బట్లర్‌ను ఆడించి ఎటువంటి రిస్క్‌ తీసుకోడదని ఇంగ్లండ్‌ జట్టు మేనేజేమెంట్‌ భావిస్తున్నట్లు సమాచారం. ఒక వేళ ఈ సిరీస్‌కు బట్లర్‌ దూరమైతే.. ఇంగ్లండ్‌ జట్టుకు ఆల్‌రౌండర్‌ మోయిన్‌ అలీ సారథ్యం వహించే అవకాశం ఉంది.

పాకిస్తాన్‌ సిరీస్‌కు ఇంగ్లండ్‌ జట్టు: జోస్ బట్లర్ (కెప్టెన్‌), మోయిన్ అలీ (వైస్‌ కెప్టెన్‌), హ్యారీ బ్రూక్, జోర్డాన్ కాక్స్, సామ్ కర్రాన్, బెన్ డకెట్, లియామ్ డాసన్, రిచర్డ్ గ్లీసన్, టామ్ హెల్మ్, విల్ జాక్స్, డేవిడ్ మలన్, ఆదిల్ రషీద్, ఫిల్ సాల్ట్, ఒల్లీ స్టోన్, రీస్ టాప్లీ , డేవిడ్ విల్లీ, క్రిస్ వోక్స్, ల్యూక్ వుడ్, మార్క్ వుడ్
చదవండి:
 Ind A vs NZ A: న్యూజిలాండ్‌తో సిరీస్‌.. కెప్టెన్‌గా సంజూ శాంసన్‌.. బీసీసీఐ ప్రకటన

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top